- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ఆదర్శ కుటుంబం’ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ అఫీసర్ పాత్రలో టాలీవుడ్ హీరో.. అధికారిక ప్రకటన విడుదల
ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ నారా రోహిత్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెం.47.’ ఇందులో వెంకటేష్ సరసన శ్రీనిధిశెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను దసరా కానుకగా.. అక్టోబర్ 2న థియేటర్స్‌లోకి తీసుకు రాబోతున్నారు. ఇందులో వెంకటేష్ మధ్యతరగతి కుటుంబ పెద్దగా కనిపించనున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో అపారమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు చిత్ర యూనిట్ ఒక బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఈ సినిమాలో వర్సటైల్ యాక్టర్ నారా రోహిత్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నారా రోహిత్ పాత్రకు సంబంధించిన వివరాలను ప్రస్తుతానికి రహస్యంగా ఉంచినప్పటికీ, ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రం సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. పోస్టర్‌లో రోహిత్ సిగరెట్ కాలుస్తూ, సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయన వెనుక పోలీస్ అని రాసి ఉన్న బోర్డ్ స్పష్టంగా కనిపిస్తుండటంతో, ఆయన ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్‌లోనే అలరించబోతున్నారని అర్ధమవుతోంది. త్రివిక్రమ్ మార్క్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు రోహిత్ పోలీస్ క్యారెక్టర్ తోడవడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత రెట్టింపయ్యాయి.






