- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే నాయిని దంపతులు
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా శత, సహస్రశత కటాభిషేక మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

దిశ, హనుమకొండ కలెక్టరెట్ : హనుమకొండలోని ప్రముఖ వేయి స్తంభాల దేవాలయంలో వర్షాలు సమృద్ధిగా కురిసి రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుతూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా శత, సహస్రశత కటాభిషేక మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డికి ఆలయ అధికారులు, ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. తొలుత శ్రీ గణపతి మహారాజును దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే, అనంతరం శ్రీ రుద్రేశ్వర స్వామివారికి అభిషేకం చేసి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్రశర్మ నేతృత్వంలో నిర్వహించిన శత, సహస్రశత కటాభిషేక పూజా కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, కుంటలు, జలాశయాలు నిండాలని, రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతూ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం ఆలయ వేద పండితులు ఎమ్మెల్యే దంపతులకు వేదాశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు అందజేశారు.






