నా మాటలను వక్రీకరించారు.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చిన జస్టిస్ సూర్యకాంత్

by Malleboina Mahesh |

ఇటీవల తాను చేసిన ‘కాక్రోచ్’ (బొద్దింక) వ్యాఖ్యలపై సీజేఐ (CJI) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టతనిచ్చారు.

నా మాటలను వక్రీకరించారు.. ‘కాక్రోచ్’ వ్యాఖ్యలపై స్పష్టత ఇచ్చిన జస్టిస్ సూర్యకాంత్
X

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టి ఓ కొత్త పార్టీని ఏర్పాటు చేయడమే కాకుండా.. నీట్ అంశంలో ఉద్రిక్త నిరసనలు చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janata Party).. సీజేఐ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పుట్టిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల తాను చేసిన ‘కాక్రోచ్’ (బొద్దింక) వ్యాఖ్యలపై సీజేఐ (CJI) జస్టిస్ సూర్యకాంత్ (Justice Suryakant) స్పష్టతనిచ్చారు. న్యాయవ్యవస్థలో నకిలీ, సరైన గుర్తింపు లేని లా డిగ్రీలతో ప్రాక్టీస్ చేస్తున్న కొందరు లాయర్ల గురించి చర్చ జరుగుతున్న సందర్భంలో మాత్రమే తాను ఆ పదాన్ని ఉపయోగించానని ఆయన తెలిపారు. అంతే తప్ప విద్యార్థులను, యువతను ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను కొందరు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారని ఈ సందర్భంగా జస్టిస్ సూర్యక్రాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

అలాగే కోర్టు సమయం వృధా చేయడంపై వస్తున్న విమర్శలపైనా ఆయన స్పందించారు. ఎలాంటి ముందస్తు పిటిషన్ దాఖలు చేయకుండానే కేసులను అత్యవసరంగా విచారించాలని కోరినందున, ధర్మాసనం విలువైన సమయాన్ని వృథా చేయవద్దని మాత్రమే తాను హెచ్చరించానని వివరణ ఇచ్చారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని, క్రమశిక్షణను కాపాడేందుకే ఆ వ్యాఖ్యలు చేశానని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్పష్టం చేశారు.

Next Story