నిరసనల్లో తీవ్ర గాయాలు.. కోలుకుంటున్న 21 ఏళ్ల బాధితురాలు!

by Malleboina Mahesh |

డాక్టర్ రామ్ మనోహర్ లోహియా (RML) ఆసుపత్రిలో చేరిన 21 ఏళ్ల యువతి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక అప్‌డేట్ ఇచ్చారు.

నిరసనల్లో తీవ్ర గాయాలు.. కోలుకుంటున్న 21 ఏళ్ల బాధితురాలు!
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఇటీవల జరిగిన నిరసనల (Protest) ఘటనలో తీవ్రంగా గాయపడి, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా (RML) ఆసుపత్రిలో చేరిన 21 ఏళ్ల యువతి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక అప్‌డేట్ ఇచ్చారు. అత్యవసర విభాగానికి తీవ్ర విషమ పరిస్థితుల్లో వచ్చిన ఆమె ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, క్రమంగా కోలుకుంటుందని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. సుమారు 72 గంటల క్రితమే ఆమెకు వెంటిలేటర్ మద్దతును (Extubated) తొలగించినట్లు, ప్రస్తుతం ఆమె సొంతంగానే శ్వాస తీసుకోగలుగుతోందని తెలిపారు.

బాధితురాలు ప్రస్తుతం పూర్తి స్పృహతో, అప్రమత్తంగా ఉంటూ వైద్యుల సూచనలకు స్పందిస్తోందని ఆర్ఎంఎల్ హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. గత 24 గంటలుగా ఆమెకు నోటి ద్వారా ఆహారం (Oral feeds) ఇస్తుండగా, దానిని శరీరం బాగానే స్వీకరిస్తుందని తెలిపారు. యువతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నప్పటికీ, మల్టీ డిసిప్లినరీ నిపుణుల బృందం పర్యవేక్షణలో ఆమెకు వైద్య సేవలు అందిస్తున్నామని, ఆమె పూర్తిగా కోలుకునే వరకు నిశితంగా పరిశీలిస్తామని వైద్యులు వెల్లడించారు.

Next Story