- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హీరోయిన్ జ్యోతిక సంచలన పోస్ట్.. నా పిల్లలను వారిలాగే పెంచుతానని సపోర్ట్..
నీట్ పేపర్ లీక్ కు వ్యతిరేక ఆందోళనలకు హీరోయిన్ జ్యోతిక మద్దతూ తెలిపుతూ ఇన్‌ష్టాగ్రామ్‌లో సంచలన పోస్ట్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్: నీట్ పేపర్ లీక్ అంశంలో రాజకీయ నాయకులతో పాటు సినిమా సెలబ్రెటీలు సైతం స్పందిస్తూ.. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగు, తమిళ సినిమాల హిరోయిన్ జ్యోతిక (Heroine Jyothika) సైతం స్పందిస్తూ.. సంచలన పోస్ట్ చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రముఖ కథానాయిక, స్టార్ హీరో సూర్య భార్య జ్యోతిక డిమాండ్ చేశారు. ఆమె తన పోస్టులో.. "నేను ఎప్పుడూ విద్యార్థులు, దేశ భవిష్యత్తు తరఫునే నిలబడతాను" అని స్పష్టం చేస్తూ, హక్కుల కోసం భయం లేకుండా పోరాడుతున్న నేటి తరం (Gen Z) యువత పట్ల తనకు ఎంతో గర్వంగా ఉందని ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేశారు.
తల్లులుగా తమ పిల్లలను సోనమ్ వాంగ్‌చుక్, అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్ వంటి ఆదర్శవంతమైన వ్యక్తులుగా పెంచాల్సిన అవసరం ఉందని జ్యోతిక పిలుపునిచ్చారు. సమాజం, విద్యార్థుల హక్కుల కోసం నిలబడే వారిని చూసి గర్విస్తున్నానని పేర్కొన్న ఆమె, భయం లేకుండా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న 'సిజెపి' (CJP)కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 'జై హింద్' అంటూ ముగించిన జ్యోతిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.






