- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీట్ లీకేజీ ఆందోళన.. విద్యార్థుల నిరసనల్లో మంత్రి కూతురు
నీట్-యూజీ పేపర్ లీకేజీ వివాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో మంత్రి కుమార్తె స్వయంగా పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్-యూజీ (NEET-UG) పేపర్ లీకేజీ వివాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో మంత్రి కుమార్తె స్వయంగా పాల్గొనడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గువాహటిలోని చాచల్‌లో జరిగిన విద్యార్థుల నిరసన కార్యక్రమంలో అస్సాం రెవెన్యూ శాఖ మంత్రి, ‘అసోం గణ పరిషత్’ (AGP) సీనియర్ నేత కేశవ్ మహంత కుమార్తె దిబిశా మహంత పాల్గొన్నారు. అస్సాంలో భాజపా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో తండ్రి కీలక మంత్రిగా ఉన్నప్పటికీ.. ఆమె మాత్రం ప్లకార్డులు చేతబూని ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యాశాఖ మంత్రికి వ్యతిరేకంగా బిగ్గరగా నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.
ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ స్పందన
ఈ ఘటనపై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ విలేకరుల సమావేశంలో స్పందిస్తూ.. ‘విద్యార్థుల నిరసన హక్కును, వారి డిమాండ్లను ప్రభుత్వం గౌరవిస్తుంది. ప్రధాని మోడీ స్వయంగా ఈ నీట్ అంశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతం అస్సాం తీవ్ర వరదలతో ఇబ్బంది పడుతున్నందున, ప్రతీ ఒక్కరూ ఈ ప్రకృతి విపత్తుపై దృష్టి సారించాలి’ అని విజ్ఞప్తి చేశారు. కాగా, పోలీసుల భద్రత నడుమ జరిగిన ఈ నిరసన కార్యక్రమం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా శాంతియుతంగా ముగిసింది.






