- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భద్రతా బలగాలకు బాడీ కెమెరాలు తప్పనిసరి.. విద్యార్థుల నిరసనల వేళ కేంద్రం సంచలన నిర్ణయం
నీట్ (NEET) పరీక్ష వివాదంపై విద్యార్థులు, అభ్యర్థులు చేపడుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: నీట్ (NEET) పరీక్ష వివాదంపై విద్యార్థులు, అభ్యర్థులు చేపడుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. నిరసనకారులను అదుపు చేసే సమయంలో భద్రతా బలగాలు, పోలీసులు అనుసరించాల్సిన వ్యూహాలపై కీలక ఆదేశాలు జారీ చేసింది. క్రమశిక్షణ, జవాబుదారీతనం పెంచడమే లక్ష్యంగా సరికొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. గతంలో నిరసనకారులపై పెల్లెట్ గన్స్ ప్రయోగించారనే వార్తలు, ప్రచారం సృష్టించిన ఆందోళనల దృష్ట్యా కేంద్రం అప్రమత్తమైంది. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా చర్యలు చేపట్టింది. ప్రాజెక్టైల్ అటాక్ గన్స్, యాంటీ రిమోట్ గన్స్ వాడకూడదని భద్రతా బలగాలు, పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. నిరసనకారులపై విద్యుత్ షాక్ ఆయుధాలు, విద్యుత్ కవచాలు (Electric Shields) వాడటాన్ని పూర్తిగా నిషేధించింది.
ప్రత్యేక మార్గదర్శకాలు..
ప్రజాందోళనల సమయంలో రద్దీని కట్టడి చేసేందుకు రంగంలోకి దిగే వేగవంతమైన స్పందన దళానికి (RAF) సీఆర్పీఎఫ్ (CRPF) ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. నిరసనల వేళ జనసమీకరణను నియంత్రించే క్రమంలో గతంలో దొర్లిన కొన్ని లోపాలను గుర్తించిన అధికారులు, వాటి ఆధారంగానే ఈ కొత్త మార్గదర్శకాలను రూపొందించారు. భద్రతా బలగాల పనితీరులో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు కేంద్రం మరో కీలక అడుగు వేసింది. ఇకపై ప్రతి ఆపరేషన్లో రద్దీని కట్టడి చేసే సిబ్బంది తప్పనిసరిగా బాడీ కెమెరాలు (Body Cameras) ధరించాలని ఆదేశించింది. దీనివల్ల ఆందోళనల సమయంలో జరిగే పరిణామాలన్నీ రికార్డు అవుతాయని, అటు అధికారుల వైపు నుంచి, ఇటు నిరసనకారుల వైపు నుంచి ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా నిరోధించవచ్చని భావిస్తోంది.






