నారా రోహిత్ 23వ చిత్రానికి క్రేజీ టైటిల్ ఫిక్స్

by Pulgam srinivas |

నారా రోహిత్ 23వ చిత్రానికి 'సౌండ్ ఇంజనీర్' అనే క్రేజీ టైటిల్‌ను కన్ఫామ్ చేశారు.

నారా రోహిత్ 23వ చిత్రానికి క్రేజీ టైటిల్ ఫిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: వైవిధ్యమైన కథాంశాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న నటుల్లో నారా రోహిత్ ఒకరు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన 23వ చిత్రానికి సంబంధించిన టైటిల్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇంతకాలం 'RN23' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి 'సౌండ్ ఇంజనీర్' అనే క్రేజీ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. తాజాగా విడుదలైన వీడియోతో పాటు టైటిల్‌ను బట్టి చూస్తే ఈ చిత్రం పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, కామెడీ ప్రధానంగా రూపొందుతున్నట్లు అర్థమవుతోంది. ఈ సినిమాతో నారా రోహిత్ మరోసారి ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటాడో చూడాలి. ఈ చిత్రంలో నయన్ సారిక కథానాయికగా నటిస్తుండగా, చినిమిల్లి మణికుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కరణ్ సి ప్రొడక్షన్స్ LLP బ్యానర్‌పై భరత్ చౌదరి నిర్మిస్తున్నారు.


Next Story