రైతు భరోసా నిధులు గోల్‌మాల్.. ఏఈఓ సస్పెన్షన్

by Jakkula.Mamatha |

అన్నదాతలకు భరోసాగా నిలవాల్సిన ప్రభుత్వ పథకంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.

రైతు భరోసా నిధులు గోల్‌మాల్.. ఏఈఓ సస్పెన్షన్
X

దిశ,​రాజంపేట: అన్నదాతలకు భరోసాగా నిలవాల్సిన ప్రభుత్వ పథకంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రైతు ఖాతాకు చేరాల్సిన నిధులను దారి మళ్లించిన వ్యవహారంలో ఏఈఓపై వేటు పడింది. కామారెడ్డి జిల్లా ​రాజంపేట మండలంలోని షేర్‌ శంకర్‌ తండాకు చెందిన కాట్రోత్ కిషన్ అనే రైతుకు రావాల్సిన రైతు భరోసా నిధుల అతని ఖాతాలో పడకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు అందడంతో ఈ వ్యవహారం బయటపడింది. దీనిపై సమగ్ర విచారణ చేపట్టిన జిల్లా వ్యవసాయ శాఖ.. సుమారు రూ. 90 వేల పైచిలుకు నిధులు ఏఈఓ ఖాతాకు మళ్లినట్లు గుర్తించి నిర్ధారించింది. ​ఈ నివేదిక ఆధారంగా ఏఈఓ మౌనికను సస్పెండ్ చేస్తూ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఏఈఓ సస్పెండ్ అయిన విషయం వాస్తవమేనని రాజంపేట ఏఓ జ్యోత్స్న ‘దిశ’కు తెలిపారు. కాగా, జిల్లా అధికారుల నుంచి సస్పెన్షన్‌కు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు మాత్రం తమకు ఇంకా రాలేదని మండల వ్యవసాయ అధికారి జ్యోత్స్న స్పష్టం చేశారు.

Next Story