ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష హాల్ టికెట్లు విడుదల

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-07-25 09:53:30  IST  )

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష హాల్ టికెట్లు విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థలందరూ తమ హాల్ టికెట్లను http://cse.ap.gov.in, http://tes2dsc.apcfss.in ద్వారా విడుదల చేసుకోవాలని కన్వీనర్ ఎం.వీ కృష్ణారెడ్డి తెలిపారు. ..

ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష హాల్ టికెట్లు విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష హాల్ టికెట్లు విడుదల చేశారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థలందరూ తమ హాల్ టికెట్లను http://cse.ap.gov.in, http://tet2dsc.apcfss.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలని కన్వీనర్ ఎం.వీ కృష్ణారెడ్డి తెలిపారు. ఆగస్టు 5 నుంచి ప్రతిరోజూ రెండు సెషన్లలో టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష ఉంటుందని, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ పరీక్షలు జరుగుతాయని చెప్పారు. పరీక్ష రాసే అభ్యర్థులు గంట ముందే ఎగ్జామ్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు. జులై 15 నుంచి అధికారిక వెబ్ సైట్ లో ఆన్ లైన్ మాక్ టెస్టును అందుబాటులో ఉంచినట్లు ఎం.వి.కృష్ణారెడ్డి వివరించారు.

Next Story