- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సినిమాల ఎంపికపై నిధి సంచలన నిర్ణయం.. ఇకపై అలాంటి పాత్రలే చేస్తానంటూ కామెంట్స్
అప్పట్లో తన వద్దకు వచ్చిన అవకాశాల్లోనే ఉత్తమమైనవి ఎంచుకున్నానని, అయితే ఇప్పుడు తన పాత్రల విషయంలో మరింత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నానని తెలిపారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇటీవల 'ది రాజా సాబ్', 'హరిహర వీరమల్లు' వంటి భారీ ప్రాజెక్టుల్లో స్టార్ హీరోల సరసన నటించినప్పటికీ సరైన హిట్ అందుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ భామ తెలుగు, హిందీ భాషల్లో 'మిరాయ్ పార్ట్-2'తో పాటు 'ది ఇన్‌ఫ్లుయెన్సర్' అనే సైకలాజికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిధి అగర్వాల్ తన కెరీర్, సినిమాల ఎంపికపై పలు కీలక విషయాలను వెల్లడించారు. ఇకపై తాను కేవలం కథానాయికగా కనిపించే పాత్రలు కాకుండా, అర్థవంతమైన, పాత్రకు ప్రాధాన్యత ఉన్న సినిమాలనే ఎంచుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అలాంటి నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకు తమిళ చిత్రసీమ సరైన వేదిక అని ఆమె అభిప్రాయపడ్డారు.
తనకు ఇండస్ట్రీలో ఎవరూ గాడ్‌ఫాదర్ లేదా గాడ్‌మదర్ లేరని, ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా వచ్చినందున ఆరంభంలో నచ్చిన పాత్రలను ఎంచుకునే వెసులుబాటు ఉండేది కాదని గుర్తుచేసుకున్నారు. అప్పట్లో తన వద్దకు వచ్చిన అవకాశాల్లోనే ఉత్తమమైనవి ఎంచుకున్నానని, అయితే ఇప్పుడు తన పాత్రల విషయంలో మరింత ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నానని తెలిపారు. ప్రస్తుతం తెలుగు, హిందీ ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల తమిళంలో నటించడం, తమిళ భాష మాట్లాడటాన్ని మిస్ అవుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం తమిళంలో రెండు ప్రాజెక్టుల చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే వివరాలు వెల్లడిస్తానని తెలిపారు. భవిష్యత్తులో బయోపిక్, పీరియడ్ ఫిల్మ్, సైన్స్ ఫిక్షన్ లేదా యాక్షన్ చిత్రాల్లో నటించాలని ఉందంటూ, తాను యాక్షన్ సీన్స్ చాలా బాగా చేయగలనని పేర్కొన్నారు.






