- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించిన రోజు ఇది: ప్రియాంక గాంధీ
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై ప్రియాంక గాంధీ స్పందించారు. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నానన్నారు.

ప్రియాంక గాంధీ: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై (Dharmendra Pradhan Resignation) కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Vadra) స్పందించారు. ఇది భారత దేశ యువత సాధించిన విజయం అని పేర్కొన్నారు. ఇవాళ వయనాడ్ పర్యటనలో ఉన్న ప్రియాంక గాంధీ మీడియాతో మాట్లాడుతూ.. . ఇవాళ నేను అనేక కారణాల వల్ల చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ప్రధాన కారణం ఏమిటంటే.. ఇవాళ (జులై 25) రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించిన వారి నుండి, మన ప్రజల గొంతును నొక్కడానికి, అణచివేయడానికి అన్ని ప్రయత్నాలు చేసిన వారి నుండి ప్రజలు తమ దేశాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ప్రారంభించిన రోజు అని అన్నారు.
మా శాయశక్తులా ప్రయత్నించాం:
కాంగ్రెస్ పార్టీగా మేము విద్యార్థులకు సాధ్యమైనంత బలంగా మద్దతు ఇచ్చేందుకు మా శాయశక్తులా ప్రయత్నించామని ప్రియాంక గాంధీ చెప్పారు. ప్రశ్నాపత్రాల లీకేజీలు, పరీక్షల సంస్కరణల అంశంపై రాహుల్ గాంధీ చాలా కాలంగా మాట్లాడుతున్నారని ఆయన గత రెండు, మూడేళ్లకు పైగా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారన్నారు. ఈ అంశాన్ని లేవనెత్తి విద్యార్థులకు మద్దతు ఇవ్వడమే కాకుండా, విద్యార్థుల హక్కుల కోసం విద్యావ్యవస్థ సంస్కరణల కోసం దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నిర్మించేలా పార్టీలోని మాతోపాటు మిగతా విభాగాలైన NSUI, యూత్ కాంగ్రెస్‌లను ప్రోత్సహించినట్లు చెప్పారు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే అని ఈ వార్త విన్నప్పుడు నేను కొంత భావోద్వేగానికి గురయ్యానన్నారు. దేశంలో ఏం జరుగుతుందో చూసేందుకు మన దేశ యువత ఎప్పుడు మేల్కొంటుందని తాను గత 10 లేదా 12 ఏళ్లలో నేను చాలాసార్లు నన్ను నేనే ప్రశ్నించుకున్నాను. ఆర్‌ఎస్‌ఎస్ మొత్తం విద్యా వ్యవస్థలో తమ వారితో నింపేస్తోంది. వారంతా మన పూర్వీకుల సిద్ధాంతాలను బలహీనపరుస్తున్నారు. నిరసనగా గళమెత్తిన యువతపై, ప్రతీ ఒక్కరిపై బలాన్ని ఉపయోగిస్తున్నారు. కానీ ఇవాళ యువత మేల్కొని ఆందోళన చేపట్టడంతో విజయం దక్కిందన్నారు.






