IND VS ZIM: వైభ‌వ్ సేఫ్‌..అభిషేక్ శ‌ర్మ‌కు బిగ్ షాక్‌ !

by velandi.Saikiran |

మరికాసేపట్లో జింబాబ్వే, భారత జట్ల మధ్య రెండో టీ20 ప్రారంభం కానుంది.

IND VS ZIM: వైభ‌వ్ సేఫ్‌..అభిషేక్ శ‌ర్మ‌కు బిగ్ షాక్‌ !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మరికాసేపట్లో జింబాబ్వే, భారత జట్ల మధ్య రెండో టీ20 ప్రారంభం కానుంది. సాయంత్రం నాలుగున్నర గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ జట్టు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో టీ20లో అభిషేక్ శర్మకు (Abhishek Sharma) రెస్ట్ ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క్రీడా వ‌ర్గాయి పేర్కొంటున్నాయి. ఇటీవల జ‌రిగిన మ్యాచ్ ల‌లో వరుసగా అతడు విఫలమవుతూ వ‌స్తున్నాడు. పెద్ద ఇన్నింగ్స్ లు ఆడలేదు. ఈ క్రమంలో అభిషేక్ శర్మ పై వేటు వేసి...అతని స్థానంలో ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ లెక్కన వైభవ్ సూర్య వంశీతో కలిసి ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ ఓపెనింగ్ చేస్తాడన్నమాట.

భార‌త జ‌ట్టు అంచ‌నా: వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ( ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌), ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్, తిలక్ వర్మ, శివమ్ దూబే, రింకూ సింగ్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్

Next Story