నేను చేసిన పనులపై నువ్వు చేసిన పనులపై చాలెంజ్ కి సిద్ధం

by Ratna Kumari |

కడియం శ్రీహరి రెండు నాలుకల ధోరణితో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారం రోజుల నుండి కడియం శ్రీహరి సొల్లుపురనం చెప్తు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య అన్నారు.

నేను చేసిన పనులపై నువ్వు చేసిన పనులపై చాలెంజ్ కి సిద్ధం
X

దిశ ధర్మసాగర్ : స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గ కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టి.రాజయ్య మాట్లాడుతూ...కడియం శ్రీహరి రెండు నాలుకల ధోరణితో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారం రోజుల నుండి కడియం శ్రీహరి సొల్లుపురనం చెప్తు, అబద్ధాలు మాట్లాడుతూ.. ప్రజలను ఆగమాగం చేస్తున్నాడని,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ఎండబెడుతూ ఆంధ్రప్రదేశ్ కు నీటిని దోచిపెడుతున్నాడని, కాలేశ్వరాన్ని తప్పుగా చూపెట్టి కెసిఆర్ కు చెడ్డ పేరు తేవడానికి రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నాడని అన్నారు.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం వల్ల కరువు వచ్చిందని, స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరి వల్ల కరువు వచ్చిందని రైతులకు వ్యతిరేకంగా కడియం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని తిన్నిoటివాసాలు లెక్కపెట్టే వ్యక్తి కడియం శ్రీహరి అని మలేషియాలో తన భార్య పేరు మీద ఉన్న ఆస్తుల చిట్ట మొత్తం తన వద్ద ఉందని నేను నిరూపించేందుకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. కడియం శ్రీహరి ఎమ్మెల్యే అయ్యుండి నీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని చెప్పడం సిగ్గుచేటని కమిషన్లకు కక్కుర్తి పడి, ఎస్టిమేషన్లు పెంచిన చరిత్ర కడియం కమిషన్లు వచ్చే పనులపై మాత్రమే కడియం ఫోకస్ చేస్తూ ఇందిరమ్మ ఇళ్లు రిబ్బన్ కట్ చేయడానికి బలవంతంగా మీటింగ్ లకు రావాలని మహిళల ఉసురు పోసుకుంటున్నారని కడియం పై డాక్టర్ రాజయ్య ఆరోపణ చేశాడు. నేను చేసిన పనులపై నువ్వు చేసిన పనులపై చాలెంజ్ కి సిద్ధమని అసలు సిసలైన కాంగ్రెస్ వాళ్లకి పదవులు ఇవ్వకుండా నీవాళ్ళకు మాత్రమే పదవులు ఇస్తూ కాంగ్రెస్ వారిని అడ్డుకుంటున్నావని రాజయ్య అన్నారు.

తిన్నింటి వాసాలు లెక్కపెట్టే వ్యక్తి కడియం...

ఎన్‌డీఎస్‌ఏ సమాధానంతో కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారం బట్టబయలైందన్నారు.మేడిగడ్డ అన్ని అనుమతులతో నిర్మించిన బ్యారేజ్ అని, కాళేశ్వరం అంటే మేడిగడ్డ ఒక్కటే కాదని, 16 రిజర్వాయర్లకు జీవనాధారమైన సమగ్ర ఎత్తిపోతల ప్రాజెక్టు అని వివరించారు.తెలంగాణకు రావాల్సిన గోదావరి జలాలను వినియోగించకుండా ఇప్పటికే 105 టీఎంసీలకు పైగా నీటిని ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లనిచ్చారని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ఆరోపించారు.కేసీఆర్ పేరు చెరిపివేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఎన్‌డీఎస్‌ఏ నివేదిక కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటిదని అన్నారు.రైతులకు నీరు అందించడంలో కడియం శ్రీహరి పూర్తిగా విఫలమయ్యారని, దేవాదుల ప్రాజెక్టు, ఉప్పుగల్–పాలకుర్తి కాలువ, లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.బీఆర్ఎస్ హయాంలో దేవాదుల ద్వారా 1.53 లక్షల ఎకరాలకు సాగునీరు అందించామని, ఏడు రిజర్వాయర్లతో స్టేషన్ ఘనాపూర్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశామని పేర్కొన్నారు.తన హయాంలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని, కడియం శ్రీహరి కూడా సిద్ధమా అని సవాల్ విసిరారు. నైతిక విలువలు ఉంటే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి రావాలని సవాల్ చేశారు.

కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సహకారంతోనే కడియం శ్రీహరి రాజకీయంగా ఎదిగారని, ఆ విషయాన్ని మరవొద్దని సూచించారు.చివరిగా, బీఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుపై మరోసారి చిల్లర, వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని కడియం శ్రీహరిని తీవ్రంగా హెచ్చరించారు. రాజకీయ విమర్శలు హుందాగా చేయాలి. నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత విమర్శలు మానుకోవాలి. కబర్దార్..! అని డాక్టర్ తాటికొండ రాజయ్య హెచ్చరించారు. ఈ మీడియా సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు మాచర్ల గణేష్, మున్సిపాలిటీ కన్వీనర్ కనకం గణేష్, కౌన్సిలర్ పొన్న రాజేష్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ గట్టు కృష్ణ సాయి, సీనియర్ నాయకులు చల్లా చందర్ రెడ్డి, కర్ర సోమిరెడ్డి, గుర్రం చిట్టిబాబు, బత్తుల రాజన్ బాబు, నాగపురి పావని, మరేడుపాక రామాదేవి, గాదె రాజు, పార్టీ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Next Story