ఢిల్లీలో తిరిగి తెరుచుకుంటున్న మెట్రో స్టేషన్లు

by Ajay Maddhiboyina |

కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలోని మెట్రో స్టేషన్‌లు ఒక్కొక్కటిగా తిరిగి తెరుచుకుంటున్నాయి. ఢిల్లీలోని మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లు ఇప్పటికే ప్రారంభించారు.

ఢిల్లీలో తిరిగి తెరుచుకుంటున్న మెట్రో స్టేషన్లు
X

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో ఢిల్లీలోని మెట్రో స్టేషన్‌లు ఒక్కొక్కటిగా తిరిగి తెరుచుకుంటున్నాయి. ఢిల్లీలోని మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ మెట్రో స్టేషన్లు ఇప్పటికే ప్రారంభించారు. జంతర్ మంతర్ నిరసనల నేపథ్యంలో భద్రతా కారణాలతో ఎంట్రీ గేట్లను డీఎంఆర్‌సీ మూసివేసింది. ఇప్పుడు విద్యార్థులు తిరిగి వెళ్లేందుకు తెరుస్తున్నారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆంక్ష‌లు మాత్రం అమ‌లులో ఉంటాయ‌ని డీఎంఆర్సీ స్ప‌ష్టం చేసింది. ఇదిలా ఉంటే జంతర్ మంతర్ వద్ద నిరసనలకు కేవలం ఢిల్లీలోని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాత్రమే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి సైతం విద్యార్థులు వచ్చారు.

కొందరు విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులు సైతం స్వాదేశానికి చేరుకుని ఢిల్లీ ఆందోళనల్లో పాల్గొని నీట్ విద్యార్థులకు మద్దతుగా నిలిచారు. ప్రతిరోజు వేల సంఖ్యలో విద్యార్థులు రావడంతో భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్ర‌భుత్వం మెట్రోపై ఆంక్ష‌లు విధించింది. ఇక ఇప్పుడు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామాతో విద్యార్థులు చ‌ల్ల‌బ‌డ్డారు. ప్ర‌స్తుతం సీజేపీ ప్ర‌తినిధులు కేంద్రంతో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. చ‌ర్చ‌ల అనంత‌రం నిర‌స‌న పూర్తిగా నిలిపివేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది.

Next Story