- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో గాంధీ భవన్‌లో సంబరాలు
కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సందర్భంగా..గాంధీ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులు శనివారం విజయోత్సవాలు చేసుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన సందర్భంగా..గాంధీ భవన్ లో కాంగ్రెస్ శ్రేణులు శనివారం విజయోత్సవాలు చేసుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్వీట్లు పంచుకుని, టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, బల్మూర్ వెంకట్, ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షులు యడవల్లి వెంకటస్వామి, విద్యార్ది, యువజన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బల్మూర్ వెంకట్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీకేజీ అంశంలో విద్యార్థులు, యువత, ప్రతిపక్ష నేత, రాహుల్ గాంధీల పోరాటం ఫలించిందని అన్నారు. ఇప్పటికైనా కేంద్రం గుణపాఠం నేర్చుకుని, విద్యావిధానంలో మార్పులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ విజయోత్సవాలు..
కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యూఐ నేతలు విజయోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉదయభాను చిబ్, జాతీయ ఎన్‌ఎస్‌యూఐ అధ్యక్షులు వినోద్ జాకర్, తెలంగాణ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి, జాతీయ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రవణ్ రావు విజయ సంకేతాలు చూపుతూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ విద్యార్థుల పోరాటానికి లభించిన విజయాన్ని స్వాగతిస్తూ, దేశవ్యాప్తంగా విద్యార్థి, యువజన ఉద్యమాలకు ఇది ఒక కీలక ఘట్టమని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం యువజన కాంగ్రెస్ ఎల్లప్పుడూ ముందుండి పోరాడుతుందని వారు తెలిపారు.






