- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో వృద్ధుడి అనుమానాస్పద మృతి
by Batti.Sumithra |
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఓ వృద్ధుడు మృతి చెందాడు.

X
దిశ, సికింద్రాబాద్ : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో శనివారం ఓ వృద్ధుడు మృతి చెందాడు. శనివారం ఉదయం 11:30 గంటలకు డిప్యూటీ స్టేషన్ సూపరింటెండెంట్ నుంచి డెత్ మెసేజ్ అందడంతో సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం ఎస్‌ఐ ఎస్.వి. సుబ్బారెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడు ఘండియా కర్షన్‌భాయ్ రతన్‌శిభాయ్ (75), తండ్రి రతన్‌శిభాయ్. ప్రస్తుతం మేడ్చల్ జిల్లా నాగారం, ఈసీఐఎల్‌లో నివాసం ఉంటుండగా, స్వస్థలం గుజరాత్ రాష్ట్రంలోని రాజ్‌కోట్ జిల్లా, మోర్విగా గుర్తించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లోని షంటింగ్ లైన్–1 ట్రాక్ పై తలపెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా కనిపిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






