- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముద్రగడ కులం మార్చుకోలేదు.. పేరు మాత్రమే: అంబటి రాంబాబు
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంపేరు మాత్రమే మార్చుకున్నారని కులం కాదని, ఇది గుర్తు పెట్టుకోవాలని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు...

దిశ, వెబ్ డెస్క్: కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం(Kapu movement leader Mudragada Padmanabham) పేరు మాత్రమే మార్చుకున్నారని కులం కాదని, ఇది గుర్తు పెట్టుకోవాలని వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు(Ycp Former Minsiter Ambati Rambabu) అన్నారు. కాపు జేఏసీ గుంటూరులో నిర్వహించిన ముద్రగడ సంతాపసభలో ఆయన మాట్లాడారు. ముద్రగడ అన్నమాటకు నిలబడి పేరు మార్చుకున్న ఒకే నాయకుడు, కాపు వ్యక్తి అని అంబటి కొనియాడారు. మాట మీద నిలబడిన ముద్రగడను చూసి కాపు సమాజం గర్వించాలన్నారు. ముద్రగడకు మరణం లేదన్నారు. తిరస్కరించడాన్ని కూడా మర్యాద చెప్పే ఒకే వ్యక్తి ముద్రగడ అని చెప్పారు.
చిన్నప్పటి నుంచి చూస్తున్నా..
తాను చిన్నప్పటి నుంచి ముద్రగడను చూస్తున్నానని, చాలా గర్వించదగ్గ వ్యక్తి అని అంబటి వ్యాఖ్యానించారు. గోరు ముద్దలు పెట్టినట్లు టిఫిన్లు భోజనం పెడతాడని గుర్తు చేశారు. పేరు మార్చుకుంటానని చాలా మంది చెప్పారని, కానీ ముద్రగడ మాట మీద నిలబడ్డారని పేర్కొన్నారు. మానవ సమాజంలో మాట మీద నిలబడి పేరు మార్చుకున్న ఒకే ఒక వ్యక్తి ముద్రగడ అని అంబటి వ్యాఖ్యానించారు.






