నాలుగు ఎకరాల అటవీ భూమి స్వాధీనం

by Jakkula.Mamatha |

గాంధారి బీట్ పరిధిలోని 768 కంపార్ట్మెంట్ పరిధిలోని నాలుగు ఎకరాల అటవీ భూమిలో జేసీబీతో గుంతలు తవ్వించి స్వాధీనం చేసుకున్నట్లు గాంధారి అటవీ శాఖ అధికారి రమేష్ తెలిపారు.

నాలుగు ఎకరాల అటవీ భూమి స్వాధీనం
X

దిశ, గాంధారి: గాంధారి బీట్ పరిధిలోని 768 కంపార్ట్మెంట్ పరిధిలోని నాలుగు ఎకరాల అటవీ భూమిలో జేసీబీతో గుంతలు తవ్వించి స్వాధీనం చేసుకున్నట్లు గాంధారి అటవీ శాఖ అధికారి రమేష్ తెలిపారు. ఈ సందర్భంగా శనివారం మండలంలోని చద్మల్ తండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ దేవి సింగ్ ఆధ్వర్యంలో అడవి సంరక్షణ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అటవీ భూములను సంరక్షించాల్సిన బాధ్యత అందరిదని సూచించారు.

అడవిలోని చెట్లను నరికి వేయడం మూలంగా వర్షాలు సకాలంలో కురవకపోవడంతో పాటు వన్యప్రాణుల మనుగడ ప్రశ్నార్ధకం అవుతుందన్నారు. ప్రతి వన్యప్రాణికి భూమిపై బతికే హక్కు ఉందన్నారు. చెట్లు లేకపోతే మానవాళి మనుగడకు అవసరమైన స్వచ్ఛమైన గాలి రాకపోవడంతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండదన్నారు. అడవులను నరకడం, నిప్పు పెట్టడం, చెట్లను నరికి చదును చేయడం చట్టరీత్యా నేరమన్నారు. ప్రతి ఒక్కరు తమ పంట పొలాల్లో, ఇంటి ఆవరణలో తప్పనిసరిగా మొక్కలను పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తండా ఉపసర్పంచ్ ప్రవీణ్, డిఆర్ఓ మోసం అలీ ఖాన్, బీట్ అధికారి పర్వీన్ బేగం, బేస్ క్యాంప్ సిబ్బంది, తండావాసులు పాల్గొన్నారు.

Next Story