వరి పంట మానేయండి: సీఎం చంద్రబాబు

by Vemula.Srinu Prasad |

వరి పంట మానేయాలని రాష్ట్ర ప్రజలందికీ ఆలూరు నుంచి విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. వరి ధాన్యంలో ఆదాయం రాదని, ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయని ఆయన తెలిపారు...

వరి పంట మానేయండి: సీఎం చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: వరి పంట మానేయాలని రాష్ట్ర ప్రజలందికీ కర్నూలు జిల్లా ఆలూరు నుంచి విజ్ఞప్తి చేస్తున్నానని సీఎం చంద్రబాబు అన్నారు. వరి ధాన్యంలో ఆదాయం రాదని, ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయని ఆయన తెలిపారు. మారిన ఆహారపు అలవాట్లను రైతాంగమూ అర్థం చేసుకోవాలన్నారు. ఎల్‌నినో ప్రభావంత వల్ల ఈ సంవత్సరం ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నీళ్లు సమర్ధవంతంగా ఉపయోగించుకుంటామని తెలిపిన చంద్రబాబు భూగర్భ జలాలు ఉంటే ఏదైనా మెట్ట ఫైర్లు వేయాలని, రూ.10 వస్తాయని పిలుపునిచ్చారు. ముందు పళ్ళు, కూరగాయలు ఉండే పంటల్ని కాపాడుకుందామని చంద్రబాబు పిలుపునిచ్చారు.

ఎప్పుడు వర్షం పడినా..

ఆ తర్వాత ప్రకృతి సేద్యానికి వెళ్లాలని రైతలుకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు. ఆరు నెలల్లో ఎప్పుడు వర్షం పడినా మొలకలు వచ్చేలా సీడ్ బాల్స్‌ను వేయాలన్నారు. మొలకల వల్ల కనీసం పశువులకు గండి అయినా వస్తుందని తెలిపారు. రెండు, మూడు వర్షాలు పడితే పంట వస్తుందని తెలిపారు. భూమి సారం కూడా పెరుగుతుందన్నారు. సీడ్ బాల్స్ ఖర్చును కూడా అవసరమైతే ప్రభుత్వమే పెట్టుకుంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు.లక్ష కోట్లు ఖర్చు పెట్టి రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా మార్చబోతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. దేశంలో ఉత్పత్తి నుంచి పండ్లు రాయలసీమ నుంచే వస్తున్నాయని తెలిపారు. రాయలసీమ భూముల్లో బంగారం పండించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Next Story