- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘విద్యాశాఖ మంత్రిగా ఉండటం అంత ఈజీ కాదు’.. కొత్త చర్చకు దారితీసిన పురందేశ్వరి ట్వీట్
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేసిన పరిణామంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పదవికి రాజీనామా చేసిన పరిణామంపై బీజేపీ ఆంధ్రప్రదేశ్ మాజీ అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఈ మేరకు ఆమె చేసిన ఒక సుధీర్ఘ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ. సామాజిక మాధ్యమాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ధర్మేంద్ర ప్రధాన్ మంత్రి పదవికి రాజీనామా చేయడాన్ని తాము గౌరవిస్తున్నామని పురందేశ్వరి తెలిపారు. విద్యార్థి ఉద్యమాలు, ప్రజా జీవితంతో ఆయనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని ఆమె గుర్తుచేశారు. రాజకీయ ప్రయాణంలో యువత ఆశలు, ఆకాంక్షలతో ఇంతటి సన్నిహిత సంబంధాన్ని కొనసాగించిన నాయకులు చాలా తక్కువ మంది ఉంటారని కొనియాడారు. భారత విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆయన పదవీకాలంలో పూర్తి అంకితభావంతో పనిచేశారని, స్పష్టమైన లక్ష్యంతో విధులు నిర్వర్తించారనడంలో సందేహం లేదని పేర్కొన్నారు.
చర్చనీయాంశంగా మారిన వ్యాఖ్యలు..
అయితే, ఆమె తన ట్వీట్‌లో విద్యా వ్యవస్థ, నాయకత్వంపై ఆమె చేసిన కొన్ని కీలక వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. "విద్యా రంగంలో నాయకత్వం వహించడం ఎప్పుడూ అంత సులభం కాదు. లక్షలాది మంది విద్యార్థుల ప్రయోజనాలను కాపాడుతూ, పరస్పర విరుద్ధమైన డిమాండ్లను సమతుల్యం చేయడం అత్యంత అవసరం. ధర్మేంద్ర ప్రధాన్ ఈ బాధ్యతను పట్టుదలతో నిర్వహించారు. ఆయన ఈ దశ నుంచి నిష్క్రమిస్తున్న సమయంలో.. భారతదేశంలో విద్య యొక్క భవిష్యత్తుపై ఒక ముఖ్యమైన చర్చను మిగిల్చి వెళ్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ చర్చ మరింత ముమ్మరం కానుంది." అని దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. విద్యా వ్యవస్థలో భవిష్యత్తు సవాళ్లు, పరస్పర విరుద్ధమైన డిమాండ్ల గురించి పురందేశ్వరి ప్రస్తావించడం పెద్ద చర్చకు దారి తీస్తోంది. వచ్చే ధర్మేంద్ర ప్రధాన్ తర్వాత ఆ బాధ్యతలు చేపట్టే వారిని ఆలోచనలో పడేసేలా ఆమె చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. దేశంలో విద్యా రంగానికి రాబోయే రోజుల్లో ఎలాంటి దిశానిర్దేశం అవసరమనే దానిపై ఈ వ్యాఖ్యలు కొత్త చర్చకు తెరలేపాయి.






