వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరగనున్న ఫోన్ల ధరలు !

by velandi.Saikiran |

వినియోగదారులకు బిగ్ అలర్ట్. కొద్ది రోజుల్లోనే ఆండ్రాయిడ్ మొబైల్స్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

వినియోగదారులకు షాక్.. మళ్లీ పెరగనున్న ఫోన్ల ధరలు !
X

దిశ‌, వెబ్ డెస్క్‌: వినియోగదారులకు బిగ్ అలర్ట్. కొద్ది రోజుల్లోనే ఆండ్రాయిడ్ మొబైల్స్ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి స్నాప్ డ్రాగన్ చిప్ ల ధరలను పెంచనున్నట్లు 'క్వాల్ కామ్' కంపెనీ కీలక ప్రకటన చేసింది. ఈ క్రమంలోనే మొబైల్స్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. చిప్ ల తయారీ ఖర్చులు పెరగడంతో 'క్వాల్ కామ్' ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఈ పెంపు 10 శాతానికి పైన ఉండే అవకాశాలు ఉన్నట్లు కథనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఈ కంపెనీ చిప్ లను ఉపయోగిస్తున్న షావోమి, శాంసంగ్, వన్ ప్లస్, గూగుల్, మోటరోలా లాంటి కంపెనీల ఆండ్రాయిడ్ డివైస్ ల ధరలు పెరగనున్నాయి. మొబైల్స్ తో పాటు ల్యాప్ టాప్స్‌ ధరలు మరింత భారం అయ్యే ప్రమాదం ఉంది.

Next Story