ఆయనతో కలిసి పనిచేయడంతో నా కల నెరవేరినట్లే.. స్టార్ దర్శకుడిపై వామికా గబ్బి ప్రశంసల జల్లు

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-25 09:47:55  IST  )

సెట్స్‌లో లోకేష్ చూపించే డెడికేషన్ చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు.

ఆయనతో కలిసి పనిచేయడంతో నా కల నెరవేరినట్లే.. స్టార్ దర్శకుడిపై వామికా గబ్బి ప్రశంసల జల్లు
X

దిశ, సినిమా: స్టార్ హీరోలతో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లు తెరకెక్కిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు లోకేష్ కనగరాజ్, ఇప్పుడు హీరోగా మారి అలరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన హీరోగా నటించిన లేటెస్ట్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘డీసీ’. 'కెప్టెన్ మిల్లర్' చిత్రంతో ప్రశంసలు అందుకున్న అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ నటి వామికా గబ్బి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించింది. ఈ సినిమా జూలై 31న థియేటర్లలోకి రాబోతోంది. సినిమా విడుదల దగ్గర పడుతుండటంతో మేకర్స్ ఇటీవల గ్రాండ్‌గా ఆడియో లాంచ్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ వామికా గబ్బి, లోకేష్ కనగరాజ్‌తో పనిచేసిన అనుభవాన్ని పంచుకుంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు.

వామికా మాట్లాడుతూ... సెట్స్‌లో లోకేష్ చూపించే డెడికేషన్ చూసి తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. దర్శకుడిగా ఆయన ప్రతిభ అందరికీ తెలిసిందేనని, కానీ నటుడిగా ఆయనలోని నూతన కోణాన్ని చూసి తాను మరింత ముగ్ధురాలినయ్యానని అన్నారు. ఒక వైపు డైరెక్షన్‌ను, మరోవైపు యాక్టింగ్‌ను ఆయన హ్యాండిల్ చేసిన విధానం అద్భుతమని ప్రశంసించారు. బహుశా భవిష్యత్తులో ఆయన తన సినిమాలకు సంగీతం కూడా అందిస్తారేమోనని చెప్పారు. అలాగే లోకేష్‌ను ఒక మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా, రియల్ రాక్‌స్టార్‌గా అభివర్ణించారు. లక్షలాది మంది ప్రేక్షకులు ఆయన తెరకెక్కించిన సినిమాల్లోని పాటలకు స్టెప్పులేశారని, అంతటి గుర్తింపు పొందిన టాలెంటెడ్ పర్సన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టమని, తనకల నెరవేరిందని చెప్పారు. వామికా చేసిన ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Next Story