మునుగోడులో నా కాడరే రాజగోపాల్ రెడ్డిని గెలిపించింది: ఎమ్మెల్యే సామేల్

by Malleboina Mahesh |   (  Updated:2026-07-25 09:01:18  IST  )

కోమటిరెడ్డి బ్రదర్స్‌ను లక్ష్యంగా చేసుకుని తుంగతూర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల శామేల్ శనివారం మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

మునుగోడులో నా కాడరే రాజగోపాల్ రెడ్డిని గెలిపించింది: ఎమ్మెల్యే సామేల్
X

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌లో వరుస వివాదాలు సంచలనంగా మారాయి. తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ (MLA Samel) కోమటిరెడ్డి బ్రదర్స్ (Komatireddy Brothers)ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy)ని తన కాడర్ కార్యకర్తలే గెలిపించారని, ఇప్పుడు తన కాడర్ బాద పడుతుందన్నారు. తనకు ఏఐసీసీ (AICC) ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిందని, రాజగోపాల్ రెడ్డి ఇవ్వలేదని తీవ్ర స్థాయి విమర్శలు చేశారు. అలాగే ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (MLA Rajagopal Reddy) కంటే ముందే తాను కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని ఈ సందర్భంగా మందుల సామేల్ చెప్పుకొచ్చారు. నా నియోజకవర్గానికి చెప్పకుండా మంత్రి వెంకట్ రెడ్డి వచ్చారని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కోమటిరెడ్డి బ్రదర్స్ పై హాట్ కామెంట్స్ చేశారు.

ఇదిలా ఉంటే శుక్రవారం జరిగిన ఓ మీడియా సమావేశంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ ఫైర్ అయ్యారు. నల్గొండ జిల్లా మీ రాజ్యం అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. తమ గురించి ఎందుకు హీనంగా మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. వీరేశం 60వేల మెజారిటీతో, తాను 50వేల మెజారిటీతో గెలిచామని చెప్పారు. మీ దగ్గర మేము చేతులు చాచి గెలవలేదని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి తుంగతుర్తి, నకిరేకల్ నియోజకవర్గాలు బాగాలేవు అని అంటున్నాడు.. ముందు ఆయన మునుగోడు పరిస్థితిని చూసుకోవాలన్నారు. మునుగోడులో అభివృద్ధి జరగలేదు, పరిస్థితి బాగాలేదని తనకు కూడా రిపోర్ట్ వచ్చిందన్నారు. రాజగోపాల్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాలని చేసిన విమర్శలకు రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story