పోలీసుల కళ్లుగప్పి పరారైన ఖైదీ.. సిద్దిపేటలో హై అలర్ట్

by Batti.Sumithra |

ఖైదీ పరారైన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను సాధారణ వైద్య పరీక్షలు నిమిత్తం జిల్లా ఆస్పత్రికి శనివారం తీసుకొచ్చారు.

పోలీసుల కళ్లుగప్పి పరారైన ఖైదీ.. సిద్దిపేటలో హై అలర్ట్
X

దిశ, సిద్దిపేట ప్రతినిధి : ఖైదీ పరారైన సంఘటన సిద్దిపేట జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సిద్దిపేట జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఏడుగురు ఖైదీలను సాధారణ వైద్య పరీక్షలు నిమిత్తం జిల్లా ఆస్పత్రికి శనివారం తీసుకొచ్చారు. ఈ క్రమంలో పోలీస్ వ్యాన్ ఎమర్జెన్సీ డోర్ నుంచి పోలీసుల కండ్లు కప్పి సాయి కుమార్ అనే ఖైదీ పరారైనట్లు సమాచారం. ఖైదీ సాయికుమార్ బైకు దొంగతనం కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. పరారైన ఖైదీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story