గోదావరిలో భారీగా తగ్గిన ఇన్‌ఫ్లో.. డెల్టా ఖరీఫ్‌కు ఢోకా లేదు: జలవనరుల శాఖ ఈఎన్‌సీ

by Ramesh Naini |

ఎల్‌నినో ప్రభావంతో గోదావరి నదిలో ఇన్‌ఫ్లో బాగా తగ్గిపోయిందని జలవనరుల శాఖ ఈఎన్‌సీ నరసింహమూర్తి వెల్లడించారు.

గోదావరిలో భారీగా తగ్గిన ఇన్‌ఫ్లో.. డెల్టా ఖరీఫ్‌కు ఢోకా లేదు: జలవనరుల శాఖ ఈఎన్‌సీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎల్‌నినో ప్రభావంతో గోదావరి నదిలో ఇన్‌ఫ్లో బాగా తగ్గిపోయిందని జలవనరుల శాఖ ఈఎన్‌సీ నరసింహమూర్తి వెల్లడించారు. గత 70 ఏళ్లలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఎన్నడూ లేని స్థాయిలో ప్రస్తుత నీటి కొరత ఏర్పడిందన్నారు. గోదావరి జిల్లాల్లో ఏకంగా 71 శాతం మేర వర్షపాతం లోటు ఉందన్నారు. అయితే, గోదావరి డెల్టా పరిధిలో ఖరీఫ్ పంటకు సాగునీటి ఢోకా ఉండదని ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. ఇప్పటికే డెల్టాకు 14,700 క్యూసెక్కుల చొప్పున 50 టీఎంసీల నీటిని అందించామని, ఖరీఫ్‌కు అవసరమైన మరో 80 టీఎంసీలను లభ్యంగా ఉన్న నీటి నిల్వల ద్వారా సర్దుబాటు చేస్తామని స్పష్టం చేశారు.

తాగునీటికే మా తొలి ప్రాధాన్యం

ప్రస్తుత పరిస్థితుల్లో తాగునీటికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఈఎన్‌సీ తెలిపారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా మెట్ట ప్రాంతాల్లో వరి సాగుకు నీరు అందించలేమని తేల్చి చెప్పారు. విశాఖ, కాకినాడ జిల్లాల తాగునీటి అవసరాలు తీర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. అలాగే, కృష్ణా డెల్టాలో నెలకొన్న నీటి కొరతను అధిగమించేందుకు సైతం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు.

Next Story