- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తిరువీర్ ‘భగవంతుడు’ సెకండ్ సింగిల్ అప్డేట్.. స్పెషల్ పోస్టర్‌తో డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
మొదటి పాటకి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించగా, తాజాగా రెండో పాట విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది.

దిశ, సినిమా: యంగ్ హీరో తిరువీర్ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనదైన నటనతో ఆకట్టుకుంటున్నారు. 'మసూద' వంటి సూపర్ హిట్ తర్వాత హీరోగా వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సరైన విజయం దక్కలేదు. ఇటీవల వచ్చిన 'ఓ సుకుమారి' నిరాశపరిచినప్పటికీ, ఫలితాలతో సంబంధం లేకుండా ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా ఆయన సరికొత్త ప్రాజెక్ట్‌లతో ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం తిరువీర్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘భగవంతుడు’. విహారి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రవి పనస నిర్మిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు నేపథ్యంతో రా అండ్ రస్టిక్ సోషల్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతోంది.
కన్నడ ప్రముఖ నటుడు రిషి ఇందులో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా మ్యూజికల్ ప్రయాణం ఇదివరకే మొదలైంది. మొదటి పాటకి శ్రోతల నుంచి మంచి స్పందన లభించగా, తాజాగా రెండో పాట విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘సిత్తరాలనవ్వు’ అని సాగే ఈ సెకండ్ సింగిల్‌ను జూలై 27న ఉదయం 10:30 గంటలకు విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు. పాట అప్‌డేట్ ఇస్తూ మేకర్స్ షేర్ చేసిన పోస్టర్ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. "వారి ప్రేమ పుష్పించేది పూల తోటల్లో కాదు, చెమటతో తడిసిన పొలాల్లో" అనే ఆసక్తికర క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్‌లో గేదెల కాపరిగా ఉన్న తిరువీర్‌ను చూసి ఫరియా అబ్దుల్లా సిగ్గుపడుతున్న లుక్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.






