- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎల్‌నినో ఎఫెక్ట్: ఇరిగేషన్ అధికారుల సెలవులు రద్దు.. మంత్రి నిమ్మల ఆదేశాలు
రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా జలవనరుల శాఖ అప్రమత్తమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో నెలకొన్న ఎల్‌నినో పరిస్థితుల దృష్ట్యా జలవనరుల శాఖ అప్రమత్తమైంది. ఈ క్లిష్ట సమయంలో రైతులకు అండగా ఉండేందుకు ఇరిగేషన్ శాఖలోని అన్ని స్థాయిల అధికారుల సెలవులను రద్దు చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. గోదావరి, కృష్ణా డెల్టాల ఇరిగేషన్ సీఈలు, ఎస్ఈలతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితులను సమీక్షించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సమన్వయంతో పని చేస్తూ ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించినట్లు మంత్రి గుర్తుచేశారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.
తాగునీటికే తొలి ప్రాధాన్యం..
పుష్కర కాలువ, ఏలేరు వ్యవస్థల ద్వారా ఉమ్మడి తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని 55 లక్షల మందికి తాగునీరు అందించాల్సి ఉంది. కాబట్టి ఈ నీటిని కేవలం తాగునీటికి, ఆరుతడి పంటలకే వినియోగించాలి. పట్టిసీమ జలాలను కూడా ఇవే అవసరాలకు వాడాలి. గోదావరి డెల్టాలో... గతంలో ఎన్నడూ లేనివిధంగా సీలేరు జలాలను గోదావరి డెల్టా ఖరీఫ్ అవసరాలకు మళ్లిస్తున్నాం. మెరక ప్రాంత రైతులు తప్పనిసరిగా ఆరుతడి పంటలకే ప్రాధాన్యం ఇవ్వాలి. కాలువల్లో నీటి ప్రవాహానికి ఆటంకం లేకుండా అడ్డంకులు (Weed) తొలగించాలి.
కృష్ణా డెల్టా రైతులకు హెచ్చరిక
నాగార్జున సాగర్‌కు ఈ సీజన్‌లో నీళ్లు రాకపోయినా, రిజర్వాయర్ నిండకముందే వరి సాగు చేస్తే భవిష్యత్తులో పంటలు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉంది. సాగర్‌లోకి ఆశించిన మేర నీరు చేరకపోతే, పులిచింతల, పట్టిసీమ జలాలను 2027 జూన్ వరకు కేవలం తాగునీటి అవసరాల కోసమే రిజర్వ్ చేసుకోవాలి. పోలవరం కుడి ప్రధాన కాలువ నీరు వృధా కాకుండా కృష్ణా డెల్టాకు చేరేలా చూడాలి. గోదావరి, కృష్ణా డెల్టాల్లోని 10 జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ‘ఇరిగేషన్ అడ్వైజరీ బోర్డ్’ సమావేశాలు నిర్వహించి, ప్రస్తుత నీటి లభ్యత, పరిస్థితులపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి.. అని పేర్కొన్నారు.






