దేవరకొండలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు

by Jakkula.Mamatha |

నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు దేవరకొండ పట్టణంలో పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు చేపట్టారు.

దేవరకొండలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు
X

దిశ, దేవరకొండ టౌన్: నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు దేవరకొండ పట్టణంలో పోలీసులు శనివారం విస్తృత తనిఖీలు చేపట్టారు. దేవరకొండ ఎస్‌హెచ్ఓ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది ప్రత్యేక డాగ్ స్క్వాడ్‌తో కలిసి రంగంలోకి దిగారు. నిషేధిత మత్తు పదార్థాల(గంజాయి, డ్రగ్స్) విక్రయాలు, రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఈ సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని ప్రధాన బస్టాండ్ పరిసర ప్రాంతాలు, స్థానిక లాడ్జీలు, పాన్ షాపులను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులను, సంచులను డాగ్ స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేశారు.

ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాల సంస్కృతిపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. ఎవరైనా నిషేధిత పదార్థాలను విక్రయించినా, రవాణా చేసినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పట్టణంలో శాంతి భద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు ప్రజలు పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే తెలియజేయాలని కోరారు.

Next Story