- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ధర్మేంద్ర తరహాలోనే లోకేశ్ రాజీనామా చేయాల్సిందే: జక్కంపూడి రాజా
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తరహాలోనే రాష్ట్రంలో మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు...

దిశ, వెబ్ డెస్క్: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Minister Dharmendra Pradhan) తరహాలోనే రాష్ట్రంలో మంత్రి నారా లోకేశ్(Minister Nara Lokesh) రాజీనామా చేయాలని వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా(YCP Youth Wing President Jakkampudi Raja) డిమాండ్ చేశారు. డీఎస్సీలో అక్రమాలపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఇప్పటివరకు ఎందుకు స్పందిచలేదని చెప్పారు. బాధ్యత వహించాల్సిన మంత్రి పదవిలో కొనసాగడం సరికాదన్నారు. లోకేశ్ రాజీనామా చేసి డీఎస్సీలో జరిగిన అక్రమాలపై విచారణకు సహకరించాలని సూచించారు. నిజాలు తేలేవరకు ప్రజాఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. డీఎస్సీలో అక్రమాల ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని జక్కంపూడి రాజా డిమాండ్ చేశారు. ధర్మేంద్ర ప్రధాన్‌ను ఆదర్శంగా తీసుకొని నారా లోకేశ్ కూడా తక్షణమే రాజీనామా చేయాలన్నారు. లేనిపక్షంలో ఇవాళ ధర్మేంద్ర ప్రధాన్ వంతు అయిందని, రేపు లోకేశ్ వంతు వస్తుందని జక్కంపూడి రాజా హెచ్చరించారు.






