- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం పోరాటాలతోనే సాధ్యం
సింగరేణి కార్మికుల సమస్యలకు పరిష్కారం పోరాటాల ద్వారానే సాధ్యమని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య పేర్కొన్నారు.

దిశ, గోదావరిఖని : సింగరేణి కార్మికుల సమస్యలకు పరిష్కారం పోరాటాల ద్వారానే సాధ్యమని సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వీరయ్య పేర్కొన్నారు. శనివారం జీడీకే-11 ఇంక్లైన్ పిట్ కమిటీ సమావేశం జంగపల్లి మల్లేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జీడీకే-11కు చెందిన పలువురు యువ కార్మికులు సీఐటీయూలో చేరగా, నాయకులు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎస్. వీరయ్య మాట్లాడుతూ సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యల పరిష్కారం కోసం సీఐటీయూ నిరంతరం పోరాటాలు చేస్తూ విజయాలు సాధిస్తోందన్నారు. ఆ పోరాటాలపై విశ్వాసంతోనే యువ కార్మికులు పెద్ద సంఖ్యలో యూనియన్‌లో చేరుతున్నారని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తోందని, బొగ్గు బ్లాక్‌లను ప్రైవేటు పెట్టుబడిదారులకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. లేబర్ కోడ్స్ ద్వారా కార్మికుల హక్కులను బలహీనపరిచే చర్యలను కార్మిక వర్గం ఐక్యంగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. కార్మికుల హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటాలే మార్గమని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు, రాష్ట్ర నాయకులు ఆసరి మహేష్, ఆర్జీ-1 కార్యదర్శి మెండె శ్రీనివాస్, జెల్ల గజేంద్ర, జంగపల్లి మల్లేష్, ఈ.వెంకటేశ్వర్లు, నంది నారాయణ, పెద్దపల్లి శశికిరణ్, ఈ.సాగర్, విప్రో, వెంకటేష్, ముల్కల శ్రీకాంత్, ఆరేపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.






