నన్ను హీరోను చేయకండి: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం సీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-07-25 10:04:32  IST  )

విద్యాశాఖ మంత్రి రాజీనామాతో జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల సంబరాలు జరుపుకున్నారు. మిగతా డిమాండ్లు తీరేవరకు ఉద్యమం కొనసాగుతుందని అభిజిత్ దీప్కే తెలిపారు.

నన్ను హీరోను చేయకండి:  ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం సీజేపీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: నీట్ ప్రశ్నపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయడంతో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. తమ పోరాటం ఫలించినందుకు ఆనందంతో డ్యాన్సులు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే కీలక వ్యాఖ్యలు చేశారు. మన పోరాటం ఫలితంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని విద్యావ్యవస్థలో అసలైన ప్రక్షాళన ఇప్పుడే మొదలైందన్నారు. నిరసనకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ సెల్యూట్ చేస్తున్నాననని, ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం అని తనను హీరోను చేయవద్దన్నారు. ప్రజాస్వామ్యంలో భయానికి తావులేదని మాట్లాడటానికి భయపడాల్సి వస్తే ప్రజాస్వామ్యం ఎట్లవుతుందని ప్రశ్నించారు. శాంతియుతంగా చేసే ఏ ఆందోళనతో అయినా లక్ష్యం తప్పకుండా నెరవేరుతుందని ఈ దేశ యువత శాంతియుత నిరసనలు వృథాగా పోలేదన్నారు.

మిగతా డిమాండ్లు నెరవేర్చాల్సిందే:

మాకు రాజకీయాలు అవసరం లేదని చెప్పిన అభిజిత్.. మా డిమాండ్లలో ఒకటి నెరవేరిందని మిగతావి నెరవేరే వరకు వేచి చూస్తామన్నారు. విద్యార్థులపై పెట్టిన కేసులు పూర్తిగా ఎత్తివేయాలని, విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి, నీట్ లీకేజీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలు ఒక్కొక్కరికి రు. కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసే వరకు ఈ ఉద్యమం ఆగదని అలాగే ఈ సాయంత్రం 6.30 గంటలకు కొవ్వొత్తులతో ర్యాలీ కొనసాగుతుందని పిలుపునిచ్చారు.

Next Story