రాజీనామా వైఫల్యాన్ని అంగీకరించడమే తప్ప పరిష్కారం కాదు: కవిత

by Prasad Jukanti |   (  Updated:2026-07-25 11:21:07  IST  )

ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామాపై టీఆర్ఎస్ చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.

రాజీనామా వైఫల్యాన్ని అంగీకరించడమే తప్ప పరిష్కారం కాదు: కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేసినంత మాత్రాన నీట్ ప్రశ్నపత్రం లీకేజీ సంక్షోభానికి పూర్తి పరిష్కారం దొరకినట్లు కాదని తెలంగాణ రక్షణసేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. రాజీనామా అనేది వైఫల్యాన్ని అంగీకరించడమే తప్ప సంక్షోబానికి పరిష్కారం కాదన్నారు. నిజమైన జవాబుదారీతనానికి వ్యవస్థాగత సంస్కరణలు అవసరం అని చెప్పారు. ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా నేపథ్యంలో ఎక్స్ వేదికగా స్పందించిన ఆమె.. యూపీఎస్‌సీ (UPSC) తరహాలోనే ఎన్‌టీఏ (NTA)కి కూడా చట్టబద్ధమైన స్వయంప్రతిపత్తిని కల్పించాలన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టేందుకు అత్యంత కఠినమైన చట్టాలను తీసుకురావాలని, ఆత్మహత్య చేసుకున్న ప్రతి విద్యార్థి కుటుంబానికి రూ.1 కోటి పరిహారం అందించాలి. జూలై 20న జరిగిన లాఠీఛార్జ్, పోలీసుల అరాచకత్వానికి బాధ్యులైన ప్రతి ఢిల్లీ పోలీస్ అధికారిని, ఆర్‌ఏఎఫ్ (RAF) సిబ్బందిని, ప్రభుత్వ అధికారులను జవాబుదారీలను చేయాలని డిమాండ్ చేశారు. వీటిలో తక్కువ ఏది చేసినా అది డ్యామేజ్ కంట్రోల్ మాత్రమే అవుతుంది తప్ప న్యాయం జరిగినట్లు కాదన్నారు.

Next Story