- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెటైర్+స్మార్ట్‌నెస్.. సంభాషణల్లో వ్యంగ్యం క్రియేటివిటీని పెంచుతుందా?
వ్యంగ్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో మెదడు అదనపు ప్రాసెసింగ్ కామన్ సెన్స్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఇది మైండ్‌ను మరింత షార్ప్‌గా మారుస్తుంది.

దిశ, ఫీచర్స్ : సంభాషణల్లో చలోక్తులు, హాస్యం, వ్యంగ్యం, వెటకారం వంటివి కూడా ఒక అద్భుతమైన కళగా నిపుణులు పేర్కొంటారు. అయితే ఈ విధమైన కన్వర్జేషన్ ఇరువైపులా ఆనందాన్ని, సృజనాత్మకతను ప్రేరేపిస్తుందని, తద్వారా మానసిక, ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని కూడా అధ్యయనాలు పేర్కొంటున్నాయి. ఎందుకంటే సాధారణ ఎక్స్‌ప్రెషన్స్ కంటే కూడా వ్యంగ్యం మెదడును ఎక్కువగా ఉపయోగిస్తుంది. అంటే ఈ పదాల వెనుక ఉన్న విషయాలను, నిగూఢార్థాలను అర్థం చేసుకోవడానికి అది కాస్త అధికంగా శ్రమించాల్సి ఉంటుంది.
సృజనాత్మకతను పెంచుతుంది
వ్యంగ్యాన్ని అర్థం చేసుకునే క్రమంలో మెదడు అదనపు ప్రాసెసింగ్(Additional processing) కామన్ సెన్స్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఇది మైండ్‌ను మరింత షార్ప్‌గా మారుస్తుందని టెక్నియన్(Technion) ఇజ్రాయెల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు కాల్ సెంటర్ ఉద్యోగులపై నిర్వహించిన అధ్యనంలో తేలింది. ఇక్కడ పనిచేసిన ఉద్యోగులు, కేవలం కోపంతో కూడిన కంప్లైట్స్ వచ్చినప్పటికంటే.. వ్యంగ్యంతో కూడిన ఫిర్యాదులను విన్నప్పుడు సమస్యలను మరింత త్వరగా, క్రియేటివిటీగా పరిష్కరించడాన్ని కూడా రీసెర్చర్స్ గుర్తించారు. అంటే.. వ్యంగ్యం ఇక్కడ కోపాన్ని తెప్పించే పరిస్థితిని, లేదా కోపంలో ఉన్నప్పుడు వ్యక్తం అయ్యే ప్రతికూల ప్రభావాలను తగ్గించడంలో సహాయపడిందని అధ్యయనం వెల్లడించింది. ఇది సంభాషణలలో సానుకూల ఫలితాలనిస్తుందని పేర్కొన్నది.
మానసిక సామర్థ్యం
అదే విధంగా వ్యంగ్యాన్ని (sarcasm) సులభంగా గుర్తించగల సామర్థ్యం, ఆరోగ్యకరమైన మానసిక సామర్థ్యాన్ని సూచిస్తుందని పరిశోధకులు అంటున్నారు. అయితే దీనికి విరుద్ధంగా వ్యంగ్యాన్ని గుర్తించలేకపోవడం, ఆస్వాదించకపోవడం వంటివి మెదడు సంబంధిత సమస్యలు లేదా డెమెన్షియా వంటి వ్యాధుల సంకేతం కూడా కావచ్చునని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ముఖ్యంగా ఆటిజం, తలకు గాయాలు, మెదడుకు గాయాలు, స్కిజోఫ్రీనియా వంటి పరిస్థితులు వ్యంగ్యాన్ని గ్రహించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయి. సాధారణంగా వ్యంగ్యాన్ని ఉపయోగించేవారు మిగతా వారితో పోలిస్తే సృజనాత్మకంగా ఉంటారని, ఇది మానసిక చురుకుదనాన్ని (Increases mental alertness) పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.






