- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ మందిర్ ట్రస్ట్ కీలక నిర్ణయం
by Malleboina Mahesh |
అయోధ్య రామ్ మందిర్ నిర్మాణ మరియు నిర్వహణ పనులు ఎలాంటి అవాంతరాలు లేకుండా వేగంగా కొనసాగేందుకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది

X
దిశ, వెబ్‌డెస్క్: విరాళాల్లో అక్రమాల వివాదం అనంతరం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామ్ మందిర్ నిర్మాణ, నిర్వహణ పనులు ఎలాంటి అవాంతరాలు లేకుండా వేగంగా కొనసాగేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ట్రస్ట్ మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ సంతకంతో కూడిన ఐడీ కార్డులు, ఎంట్రీ పాస్‌లను ఇటీవల చెల్లుబాటు కావని (Invalid) ప్రకటించినప్పటికీ, తాత్కాలిక ప్రాతిపదికన వాటిని మళ్లీ పునరుద్ధరించినట్లు (Valid) ఆలయ వర్గాలు వెల్లడించాయి.
ఆలయ ప్రాంగణంలోకి పనిచేసే సిబ్బంది, కార్మికులు, అధికారుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా, పనులు నిలిచిపోకుండా ఉండేందుకు ఈ తాత్కాలిక ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నూతన పాస్‌ల జారీ పూర్తయ్యే వరకు ఈ పాత ఐడెంటిటీ కార్డులు, ఎంట్రీ పాస్‌లు అమలులో ఉంటాయని ఆలయ ప్రతినిధులు స్పష్టం చేశారు.
Next Story






