కేంద్ర మంత్రులు ఇన్‌స్టా రీల్స్ చేయాలా?.. మోడీపై సీజేపీ చీఫ్ సెటైర్లు

by Prasad Jukanti |

యువతతో కనెక్ట్ అయ్యేందుకు కేంద్ర మంత్రులు సోషల్ మీడియాను వాడాలంటూ మోడీ కేబినెట్‍లో సూచించారన్న కథనాలపై సీజేపీ చీఫ్ దీప్కే సెటైర్లు వేశారు.

కేంద్ర మంత్రులు ఇన్‌స్టా రీల్స్ చేయాలా?.. మోడీపై సీజేపీ చీఫ్ సెటైర్లు
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర మంత్రులు సోషల్ మీడియాలో యాక్టివ్‍గా ఉంటూ ఇన్ స్టాగ్రామ్ రీల్స్ వంటి వాటితో యువతతో ఎప్పుడు కనెక్ట్ కావాలని కేంద్ర కేబినెట్ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తన సహచర మంత్రులకు సూచించినట్లు మీడియాలో వచ్చిన కథనాలపై సీజేపీ చీఫ్ అభిజిత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి కఠిన చర్యలు తీసుకుంటామంటూ కేబినెట్ భేటీ ఏర్పాటు చేసిన ప్రధాని మోడీ.. ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండాలని కేంద్ర మంత్రులకు సూచించారని దీప్కే సెటైర్ వేశారు. నిన్న కేబినెట్ భేటీపై జంతర్ మంతర్ వద్ద మాట్లాడిన అభిజీత్.. కేబినెట్ భేటీలో విద్యార్థుల అంశంపై చర్చించకుండా ఇన్‌స్టాలో రీల్స్ చేయాలని చెప్పడం ఏంటని మండిపడ్డారు. సోషల్ మీడియా ఖాతాలు లేని మంత్రులంతా వెంటనే ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్స్ తెరవాలని సూచించారని పేపర్ లీక్స్ పై ఇది మన ప్రధాని ప్లాన్ ఆప్ యాక్షన్ అని ఎద్దేవా చేశారు. అందుకే దేశానికి చదువుకున్న వ్యక్తి ప్రధానిగా ఉండటం అవసరమని పేర్కొన్నారు.

టైఫాయిడ్‌ బారిన పడ్డ అభిజీత్ దిప్కే:

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద యువత ఆందోళనలు కొనసాగుతున్న వేళ సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే టైఫాయిడ్‌ బారిన పడ్డారు. ఈ మేరకు ఇవాళ ఉదయం ఆయన ఓ వీడియోను రిలీజ్ చేశారు. వైద్య పరీక్షలో తనకు టైపాయిడ్ అని తేలిందని, తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమంపై ఎలాంటి ప్రభావం చూపబోదన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్త శాంతియుతంగా నిరసన కొనసాగిస్తున్న కాక్రోచ్ మద్దతుదారులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

అలాగైతే చర్చలతో పనే లేదు:

ఆందోళన చేస్తున్న సీజేపీ ప్రతినిధులతో కేంద్రం చర్చలు కొనసాగిస్తోంది. మూడో రౌండ్ చర్చలు ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు జరగనున్నాయి. ఈ చర్చల వేళ సీజేపీ ప్రతినిధి సంచలన ప్రకటన చేసింది. మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయకుంటే ఈ చర్చలతో అసలు పనే లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు సోమవారం ఉదయం సీజేపి జాతీయ అధికార ప్రతినిధి అశుతోశ్ రంకా సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వెల్లడించారు.

Next Story