- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
శ్రీ లొద్ది మల్లయ్య స్వామి ఆలయాన్ని టూరిజం హబ్‌గా తీర్చిదిద్దాలి.. మంత్రి కొండా సురేఖకు ఎమ్మెల్యే విజ్ఞప్తి
శ్రీ లొద్ది మల్లయ్య స్వామి వారి దర్శనానికి ఒక్కరోజు అనుమతి లభించినట్లు అచ్చంపేట ఎమ్మెల్యే తెలిపారు.

దిశ, బల్మూర్: నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండల పరిధిలోగల నల్లమల్ల అడవుల నడుమ ప్రకృతి ఒడిలో స్వయంభువుగా వెలసిన ప్రసిద్ధ శైవ క్షేత్రమైన శ్రీ లొద్ది మల్లయ్య స్వామి వారి దర్శనానికి ఒక్కరోజు అనుమతి లభించినట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖతో మాట్లాడి, సంబంధిత అటవీ శాఖ అధికారులతో సమన్వయం చేసి ఒక్కరోజు దర్శనానికి అనుమతి కల్పించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. అలాగే నల్లమల్ల ప్రకృతి ఒడిలో స్వయంభువుగా వెలసిన ఈ పవిత్ర శైవ క్షేత్రానికి ఉన్న ఆధ్యాత్మిక, చారిత్రక విశిష్టతను దృష్టిలో ఉంచుకుని శ్రీ లొద్ది మల్లయ్య స్వామి ఆలయాన్ని టూరిజం హబ్‌గా అభివృద్ధి చేసే దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను కోరినట్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ తెలిపారు. ఈ క్షేత్రంలో భక్తులకు మెరుగైన రవాణా, మౌలిక సదుపాయాలు, విశ్రాంతి కేంద్రాలు, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడంతో పాటు, ప్రకృతి అందాలను పరిరక్షిస్తూ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేసినట్లు పేర్కొన్నారు. నల్లమల్లలోని ఈ పవిత్ర శైవ క్షేత్రానికి భవిష్యత్తులో మరింత గుర్తింపు తీసుకురావడంతో పాటు భక్తులకు సౌకర్యాలు పెంపొందించే దిశగా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ స్పష్టం చేశారు.






