- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇండియాలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న 'ది ఒడిస్సీ'
'ది ఓడిస్సీ' ఇండియాలో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. తొలి 7 రోజుల్లోనే రూ.107.72 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: హాలీవుడ్ స్టార్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన 'ది ఓడిస్సీ' చిత్రం తాజాగా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులతో పాటు దేశవ్యాప్తంగా సినీ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఆ అంచనాలకు తగ్గట్టుగానే విడుదలైన తర్వాత ఈ చిత్రానికి ఇండియా వ్యాప్తంగా మంచి పాజిటివ్ టాక్ లభించింది. దీంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లను రాబడుతోంది. విడుదలైన తొలి ఆరు రోజుల్లోనే ఇండియా వ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించిన ఈ సినిమా, ఏడో రోజు రూ.6.15 కోట్ల నెట్ వసూళ్లను నమోదు చేసింది. మొత్తంగా తొలి ఏడు రోజుల్లో రూ.107.72 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం కూడా ఈ చిత్రం దేశవ్యాప్తంగా విజయవంతంగా ప్రదర్శితమవుతుండటంతో, ఫుల్ రన్ ముగిసే సమయానికి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






