- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్టీఆర్‌పై మనసు పారేసుకున్న కావ్య థాపర్.. నా అతిపెద్ద కల అదేనంటూ ఆసక్తికర కామెంట్స్
ఎప్పటికైనా ఎన్టీఆర్‌తో కలిసి ఒక ప్రాజెక్ట్‌లో పనిచేయాలనే బలమైన కోరిక తనకు ఉందని చెప్పారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ కావ్య థాపర్ రెండేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న అవుట్ అండ్ అవుట్ ఫన్ ఎంటర్‌టైనర్ ‘నేను రెడీ’ సినిమాలో ఆమె కథానాయికగా అవకాశం దక్కించుకున్నారు. యంగ్ హీరో హవీష్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ నర్గీస్ ఫక్రీ ఒక ప్రత్యేక పాత్రతో తెలుగు తెరకు పరిచయం అవుతుండటం విశేషం. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా విడుదల చేసిన 'కొంచెం కొంచెం' అనే రొమాంటిక్ మెలోడీ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కావ్య థాపర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్‌పై తనకున్న ప్రత్యేకమైన అభిమానాన్ని బయటపెట్టారు కావ్య స్పందిస్తూ... తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమని, తాను ఆయనకు చాలా పెద్ద అభిమానని వెల్లడించారు. ఎప్పటికైనా ఎన్టీఆర్‌తో కలిసి ఒక ప్రాజెక్ట్‌లో పనిచేయాలనే బలమైన కోరిక తనకు ఉందని చెప్పారు. ముఖ్యంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే అత్యుత్తమ డ్యాన్సర్లలో ఒకరైన తారక్‌తో కలిసి ఒక పాటకు డ్యాన్స్ చేయడం తన జీవితంలోనే ఒక అతిపెద్ద కల అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ ఎనర్జీకి సరితూగేలా ఆయన పక్కన స్టెప్పులు వేయడం ఏ నటికైనా ఎంతో ప్రత్యేకమైన విషయమని ఆమె భావించారు. 'నేను రెడీ' సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న కావ్య థాపర్‌కు ఈ చిత్రం మంచి బ్రేక్ ఇస్తుందని, భవిష్యత్తులో ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించే అవకాశాలు తెచ్చిపెడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.






