- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేను చూడని రాజకీయం కాదు.. తుంగతుర్తి కాంగ్రెస్ విభేదాలపై జగ్గారెడ్డి హాట్ కామెంట్స్
మందుల సామేల్ వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ ఇష్యూపై జగ్గారెడ్డి రియాక్ట్ అయ్యారు. తుంగతుర్తిపై నివేదిక సిద్ధం అయిందని మరికాసేపట్లో పీసీసీ చీఫ్‍కు అందజేయబోతున్నట్లు వెల్లడించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‍లో తుంగతుర్తి పంచాయితీ మళ్లీ మొదటికి వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ టార్గెట్‍గా తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఎస్సీ నియోజకవర్గంపై మీ ఆధిపత్యం ఏంటి పార్టీ ఏమైనా మీ జాగీరా అంటూ సామేల్ కామెంట్ చేయగా సామేల్‍కు టికెట్ ఇప్పించి గెలిపించింది తానే అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కౌంటర్ ఇవ్వడంతో ఈ పంచాయతీ అధికార పార్టీలో ఇప్పుడు పెద్ద అలజడిగా మారింది. ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధం వేళ తుంగతుర్తి పంచాయతీపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఇవాళ తన నివేదికను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‍కు అందజేయనున్నారు.
7 పేజీలతో నివేదిక:
ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలోని కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకం పార్టీలో చిచ్చురేపింది. ఎమ్మెల్యే మందుల సామేల్ వర్గం వర్సెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, పాత కాంగ్రెస్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ వ్యవహారం తుంగతుర్తిలో పరస్పరం కర్రలు, రాళ్లతో కొట్టుకునే వరకు చేరింది. దీంతో తుంగతుర్తి ఇష్యూ పరిశీలకుడిగా జగ్గారెడ్డిని పార్టీ నియమించింది. పార్టీ ఆదేశాలతో రంగంలోకి దిగిన జగ్గారెడ్డి ఇరువర్గాలతో వేరువేరుగా భేటీ అయ్యారు. ఈ క్రమంలో అక్కడి వివాదంపై 7 పేజీల నివేదికను జగ్గారెడ్డి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నివేదికను నిన్ననే పీసీసీ చీఫ్ కు సమర్పించాల్సి ఉన్నా అది వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు గాంధీభవన్‍లో మహేశ్ కుమార్ గౌడ్ తో భేటీ అయి ఆ నివేదికను ఆయనకు జగ్గారెడ్డి సమర్పించనున్నారు. జగ్గారెడ్డి నివేదికలో ఏముంది? అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.
నేను చూడని రాజకీయం కాదు:జగ్గారెడ్డి
పార్టీ ఆదేశాలతో పది రోజుల సమయం తీసుకుని ఇరు పక్షాల వ్యాఖ్యలను విని పరిశీలించి నివేదిక సిద్ధం చేశానని జగ్గారెడ్డి చెప్పారు. తాజాగా ఓ న్యూస్ చానల్‍తో మాట్లాడిన ఆయన ఇదంతా తాను చూడని రాజకీయం కాదని, ఎవరి కెపాసిటీ ఏందో తనకు బాగా తెలుసని కెపాసిటీ ఉందని అనుకునే వారిని చాలా మందిని చూశానని అవేవి తనను ప్రభావితం చేయవన్నారు. మొదటి ప్రాధాన్యత ఎమ్మెల్యే, రెండో ప్రాధాన్యత ఎంపీ, మూడో ప్రాధాన్యత పార్టీ కార్యకర్తల పక్షాన డీసీసీ ప్రెసిడెంట్ కు ఉంటుందని ఈ విషయాన్ని తాను ఇది వరకే చెప్పానన్నారు. ఒకరికి సానుకూలంగా మరొకరికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వలేదని పార్టీ విధానాలను, అందరి అభిప్రాయం ప్రకారమే నివేదిక రూపొందించానన్నారు. తన రిపోర్టుపై అధిష్టానం ఎలాంటి నివేదిక తీసుకుంటుందో చూడాలన్నారు.






