- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వృద్ధుడు మృతి
రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వృద్ధుడు (80) మృతి చెందిన సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది.

దిశ, శంకర్ పల్లి : రోడ్డు ప్రమాదంలో గుర్తుతెలియని వృద్ధుడు (80) మృతి చెందిన సంఘటన శంకరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. శంకర్పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ మీర్ ముదసిరి అలీ తెలిపిన వివరాల ప్రకారంగా శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని ఫతేపూర్ బ్రిడ్జి సమీపంలో అశోక్ లేలాండ్ టిప్పర్ ఒక వృద్ధుడిని ఢీ కొట్టడం వల్ల అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి. అతడు స్పృహ లేని స్థితిలో రోడ్డు పై పడిపోవడంతో స్థానికులు పోలీసులకు, 108 అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. తలకు బలమైన గాయాలైన వృద్ధుడిని 108 అంబులెన్స్ లో సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రాత్రి 8 గంటలకు వృద్ధుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుని వద్ద ఎలాంటి గుర్తింపు కార్డులు కానీ సంబంధిత వ్యక్తులు ఎవరు రాలేదని తెలిపారు. మృతునికి సంబంధిత బంధువులు ఎవరైనా శంకర్ పల్లి పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని తెలిపారు. ఈ మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ తెలిపారు.






