- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
"అందరికీ దండం పెడతాను.. నా కొడుకు జాడ చెప్పండి" నెట్టింట్లో ఓ తల్లి కన్నీటి వేడుకోలు
చెట్టంత ఎదిగిన కొడుకు కనిపించకుండా పోయాడని, ఎవరికైనా తెలిస్తే జాడ చెప్పాలని ఓ తల్లి చేస్తున్న విన్నపం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది.

దిశ, వెబ్ డెస్క్ : చెట్టంత ఎదిగిన కొడుకు కనిపించకుండా పోయాడని, ఎవరికైనా తెలిస్తే జాడ చెప్పాలని ఓ తల్లి చేస్తున్న విన్నపం ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ తల్లి ఆవేదన వైరల్ అవుతోంది. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన అంకం రాహుల్ అనే 21 ఏళ్ల యువకుడు హైదరాబాద్ లో మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. అయితే గత పదిరోజులుగా రాహుల్ కనిపించకుండా పోయాడని, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుందని, దయచేసి ఎవరికైనా తెలిస్తే ఆచూకీ చెప్పండని యువకుడి తల్లి, చెల్లి అందరినీ వేడుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కాగా పోలీసులకు సమాచారం అందించగా.. దర్యాప్తులో చివరిసారిగా కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద సంచరించినట్టు సీసీ టీవీ ఫుటేజిలో నమోదైంది. కొడుకు కనిపించడం లేదంటూ తల్లి వేడుకుంటున్న వేడుకోలు వీడియోను నెటిజన్స్ విపరీతంగా షేర్ చేస్తున్నారు.






