- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జాన్వీ కపూర్ చెప్పినా డైరెక్టర్ వినలేదు: మేకప్ ఆర్టిస్ట్
పెద్ది సీన్ల విషయంలో జాన్వీ కపూర్ చెప్పినా డైరెక్టర్ వినలేదంటూ మేకప్ ఆర్టిస్ట్ పేర్కొన్నారు.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది. మూడు రోజుల కిందట రిలీజ్ అయిన ఈ సినిమా, బాక్సాఫీస్ ను దున్నేస్తోంది. అయితే పెద్ది సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ స్కిన్ షో పై విమర్శలు తీవ్ర స్థాయిలో వస్తున్నాయి. సినిమా షూటింగ్ సమయంలోనే ఈ స్కిన్ షోపై జాన్వీ అభ్యంతరం చెప్పినట్లు స్క్రీన్ షాట్లు కూడా వైరల్ అయ్యాయి.
అయితే ఈ వివాదంపైన తాజాగా జాన్వీ కపూర్ మేకప్ ఆర్టిస్ట్ సావ్లీన్ కౌర్ సోషల్ మీడియా వేదికగా సంచలన పోస్ట్ చేసి.. మరో వివాదానికి తెర లేపారు. జాన్వీ కపూర్ ప్రొఫెషనల్ బౌండరీ గీశారని.. బోల్డ్ సీన్లు వద్దని ముందే చెప్పినట్లు వెల్లడించారు. కానీ సినిమా డైరెక్టర్ మాత్రం గీత దాటి... తనకు నచ్చినట్లు చేశారని ఆరోపణలు చేశారు. బాక్సాఫీస్ నెంబర్స్ కోసం ఫైనల్ ఎడిట్ లో.. స్కిన్ షో అలాగే ఉంచారని ఆరోపించారు. దీంతో జాన్వీ మేకప్ ఆర్టిస్ట్ సావ్లీన్ కౌర్ చేసిన పోస్టు దుమారం లేపుతోంది.






