నియోజకవర్గం సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే

by Taduka Kalyani |

ఎం ఎం సి కార్పొరేషన్ శంకుస్థాపనలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పలు సమస్యలను తీసుకెళ్లారు.

నియోజకవర్గం సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే
X

దిశ, నాచారం : ఎం ఎం సి కార్పొరేషన్ శంకుస్థాపనలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పలు సమస్యలను తీసుకెళ్లారు. ఉప్పల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల కు స్థలం లేక పాఠశాలలో నిర్వహిస్తున్నారని.. దీనికి శాశ్వత భవన నిర్మాణం కొరకు స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రామంతపూర్, పటేల్ కుంట చెరువు సుందరీకరణ చేపట్టాలని కోరారు. ఉప్పల్లోనే మెట్రో స్టేడియంకి నాగోల్ కు బదులుగా ఉప్పల్ స్టేడియం గా మార్చాలని, చర్లపల్లిలోని ఐజి కాలనీలో ఇందిరమ్మ ఇళ్లలో 2000 మంది పైగా నివాసం ఉంటున్నారని .. డ్రైనేజీ, తాగునీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే కోరారు. ఉస్మానియా యూనివర్సిటీలోని మూడు క్యాంపుల్లో నివాసం ఉంటున్న వారికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించాలన్నారు. గత ఏడాది రామంతపురంలో విద్యుత్ ఘాతానికి గురైన కుటుంబానికి పరిహారం అందించడంతో పాటు బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. కుంభమేళలో రోడ్డు ప్రమాదానికి గురై చనిపోయిన ఏడు మంది బాధ్యత కుటుంబాలకు పరిహారం అందించి ఆదుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సిఎం దృష్టికి తీసుకెళ్లారు. పలు సమస్యలకు సీఎం సానుకూలంగా స్పందించారు.

మాజీ ఎమ్మెల్యే విగ్రహం ఏర్పాటుకు హామీ:

ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి సేవల గాను ఫ్లైఓవర్కు బండారి రాజిరెడ్డి నామకరణం చేస్తే తప్పేంటని సీఎం ప్రశ్నించారు. కాప్రా సర్కిల్ చైర్మన్ గా, మాజీ ఎమ్మెల్యేగా, టీటీడీ బోర్డు మాజీ సభ్యులుగా దివంగత రాజిరెడ్డి విశేష సేవలు అందించాలని కొనియాడారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి మాజీ ఎమ్మెల్యే రాజిరెడ్డి పేరు తెలుసున ని సిఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. తాను మల్కాజ్గిరి ఎం పి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు.. తనకు ఓటు వేయాలని ప్రజలను కోరారని తెలిపారు. తాను కష్టకాలంలో ఉన్నప్పుడు.. దివంగత రాజిరెడ్డి అండగా ఉన్నాడని.. అలాగే పార్టీ కోసం విశేష కృషి చేశాడని కొనియాడారు. ఉప్పల్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే బండారి రాజిరెడ్డి విగ్రహం ఏర్పాటు చేస్తానని సీఎం హామీ ఇచ్చారు.

Next Story