పెద్ది బంప‌ర్ హిట్..రామ్ చరణ్ సంచ‌ల‌న నిర్ణ‌యం !

by velandi.Saikiran |

పెద్ది బంప‌ర్ హిట్ అయిన త‌రుణంలో రామ్ చరణ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నార‌ని టాక్‌.

పెద్ది బంప‌ర్ హిట్..రామ్ చరణ్ సంచ‌ల‌న నిర్ణ‌యం !
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్.. తన కంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. RRR లాంటి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కు వెళ్లిన రామ్ చరణ్, లేటెస్ట్ గా పెద్ది సినిమా చేశారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బంపర్ హిట్ అయింది. రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. అయితే ఈ సినిమా బంపర్ హిట్ అయిన నేపథ్యంలో హీరో రామ్ చరణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్ లో వార్త వైరల్ గా మారింది.

పెద్ది ట్రాన్స్ఫర్మేషన్ కోసం రామ్ చరణ్ దాదాపు రెండు సంవత్సరాలు కష్టపడ్డ సంగతి తెలిసిందే. ఫిజికల్ గా ఎంతో డిమాండ్ ఉన్న రోల్ కు న్యాయం చేసేందుకు ఎక్కడా వెనక్కి తగ్గలేదట. ఈ నేపథ్యంలో ఆయనకు తీవ్ర గాయాలు అయ్యాయి. లేటెస్ట్ గా చేతికి గాయం కూడా జరిగింది. అయితే వాటి నుంచి రికవరీ కావడం కోసం మూడు నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాడట. ఈ మూడు నెలల పాటు ఫ్యామిలీతో కాస్త రిలాక్స్ అయ్యేందుకు డిసైడ్ అయినట్లు చెబుతున్నారు. ఇందులో భాగంగానే విదేశీ టూర్లకు కూడా వెళ్లే అవకాశాలు ఉన్నాయట. ఈ క్రమంలో సుకుమార్ తో చ‌ర‌ణ్‌ చేయబోయే తర్వాతి సినిమా కాస్త వాయిదా పడే అవకాశాలు ఉన్నాయ‌ని టాక్‌.

Next Story