పాప్‌కార్న్ తింటూ పెద్ది చూసిన రామ్ చ‌ర‌ణ్‌..వీడియో వైర‌ల్

by velandi.Saikiran |

పాప్‌కార్న్ తింటూ పెద్ది చూసిన రామ్ చ‌ర‌ణ్‌..వీడియో వైర‌ల్ గా మారింది.

పాప్‌కార్న్ తింటూ పెద్ది చూసిన రామ్ చ‌ర‌ణ్‌..వీడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూన్ 4వ తేదీన రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కలెక్షన్స్ రూ.230 కోట్లు దాటిపోయాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమాను.. బుచ్చిబాబు చాలా గ్రాండ్ గా తెరకెక్కించారు. ఈ క్రమంలో సినిమా కథ జనాలకు బాగానే ఎక్కింది. దీంతో కలెక్షన్స్ వర్షం కురుస్తోంది.

ప్రసాద్ ఐమాక్స్ లో రామ్ చరణ్, బుచ్చిబాబు

పెద్ది చాలా సక్సెస్ ఫుల్ గా థియేటర్లలో నడుస్తున్న నేపథ్యంలో రామ్ చరణ్ ఈ మూవీని తిలకించారు. పెద్ది చిత్ర బృందం సభ్యులతో కలిసి ప్రసాద్ ఐమాక్స్ కు వెళ్లిన రామ్ చరణ్, సినిమా చూశారు. పాప్ కార్న్ తింటూ చిల్ అయ్యాడు. స్క్రీన్ పైన తన యాక్టింగ్ చూస్తూ ఎంజాయ్ చేశాడు రామ్ చరణ్. ఈ వీడియో వైరల్ గా మారింది. క్లిక్

Next Story