- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
French Open : ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా జ్వెరెవ్.. తొలి జర్మనీ ప్లేయర్‌గా ఘనత
జర్మనీ టెన్నిస్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్‌గా అవతరించాడు.

దిశ, స్పోర్ట్స్ : జర్మనీ టెన్నిస్ ప్లేయర్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ఎట్టకేలకు సాధించాడు. కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్ గెలిచాడు. గతంలో మూడుసార్లు ఫైనల్‌లో బోల్తా పడిన అతను ఈ సారి ఫ్రెంచ్ ఓపెన్‌లో తన కలను సాకారం చేసుకున్నాడు. ఎర్రమట్టి కోర్టులో మెన్స్ సింగిల్స్ చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం జరిగిన ఫైనల్‌లో జ్వెరెవ్ ఇటలీ ఆటగాడు ఫ్లావియో కొబోలీపై నెగ్గి టైటిల్ సొంతం చేసుకున్నాడు.
అల్కరాజ్ విత్ డ్రా అవడం, సిన్నర్ తొలి రౌండ్‌లో, జకోవిచ్ మూడో రౌండ్‌లో నిష్ర్కమించడంతో జ్వెరెవ్ టైటిల్ వేట సుగుమమైంది. కానీ, టోర్నీలో అతని ప్రయాణం మాత్రం అంత తేలికగా ఏం లేదు. ప్రతి రౌండ్‌లోనూ పోరాట పటిమ కనబరిచాడు. ఇక ఫైనల్‌లోనూ అతను సంచలన ప్రదర్శన చేశాడు. ఇటలీ ప్లేయర్ కొబోలితో హోరాహోరీగా పోరాడి గెలిచాడు. ఐదు సెట్లలో జరిగిన మ్యాచ్‌లో 6-1, 4-6, 6-4, 6-7(5-7), 6-1 తేడాతో విజయం సాధించాడు. ఈ మ్యాచ్ 4 గంటల 16 నిమిషాలపాటు సాగడం గమనార్హం. కొబోలి గట్టిపోటీనివ్వడంతో జ్వెరెవ్ గెలుపు కోసం చెమటోడ్చాడు. ఒక సెట్ జ్వెరెవ్ గెలిస్తే.. మరో సెట్ కొబోలి గెలుస్తూ రావడంతో మ్యాచ్ నిర్ణయాత్మక ఐదో సెట్ వరకూ వెళ్లింది. టైటిల్ కోసం ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు పోరాడారు. కానీ, చివరికి జ్వెరెవ్‌నే విజయం వరించింది. ఐదో సెట్‌లో అతను స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించి కొబోలికి కళ్లెం వేసి విజేతగా నిలిచాడు. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన మొట్టమొదట జర్మనీ పురుష ప్లేయర్‌గా నిలిచాడు. అంతేకాకుండా 30 ఏళ్ల తర్వాత ఓ జర్మనీ ఆటగాడు గ్రాండ్‌స్లామ్ టైటిల్ దక్కించుకున్నాడు. ఇంతకుముందు 1996లో బెకెర్ ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచాడు.






