- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైభవ్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు.. అతని తల్లిదండ్రులకు స్పెషల్ పర్మిషన్
యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో సంచలన ప్రదర్శన చేసిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ భారత టీ20 జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే. ఐర్లాండ్, ఇంగ్లాండ్ టూరులతోపాటు ఆసియా గేమ్స్‌కు ప్రకటించిన జట్టులో అతనికి చోటు దక్కింది. జాతీయ జట్టుకు ఎంపికైన అతి పిన్క వయస్కుడు అతనే. సీనియర్ జట్టుకు ఆడటానికి ముందు అతను భారత ‘ఏ’ జట్టుతో కలిసి ట్రై సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించనున్నాడు. ఈ నేపథ్యంలో అతని వయసు దృష్ట్యా వైభవ్ కోసం బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వైభవ్‌తోపాటు పర్యటించడానికి అతని తల్లిదండ్రులకు అనుమతినిచ్చింది. ‘అతను ఇంకా చిన్న పిల్లాడే. భారత ‘ఏ’ జట్టులోని మిగతా ప్లేయర్లు పెద్దవారు. అతనితోపాటు అతని తల్లిదండ్రులు ప్రయాణించడం సరైందేనని భావించాం. అతని వెంట వెళ్లాలని వైభవ్ తల్లిదండ్రులను కోరాం. వారు వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చు. ఒకవేళ వారు ఇంగ్లాండ్ కూడా వెళ్లాలనుకున్నా బీసీసీఐ మద్దతు ఇస్తుంది.సీనియర్ ప్లేయర్లతో కలిసిపోవడానికి అతనికి కాస్త సమయం పడుతుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం.’అని బీసీసీఐ సెక్రెటరీ దేవజిత్ సైకియా వెల్లడించారు.






