- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కెప్టెన్సీ రావడంపై తొలిసారి స్పందించిన శ్రేయస్
కెప్టెన్సీ రావడంపై తొలిసారి స్పందించారు శ్రేయస్ అయ్యర్.

దిశ, వెబ్ డెస్క్: టీ20 కెప్టెన్ గా అవకాశం రావడంపై శ్రేయస్ అయ్యర్ తొలిసారిగా స్పందించారు. కెప్టెన్సీ వచ్చిన నేపథ్యంలో తన పర్సనాలిటీని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మార్చుకోబోనని.. ఇప్పుడు ఎలా ఉన్నానో.. భవిష్యత్తులో కూడా అదే తరహాలో ఉంటానని వెల్లడించారు. ఇతరుల లాగా ఉండేందుకు తాను అస్సలు ప్రయత్నించబోనని.. వేరే వారి నీడలో ఉండటం తనకు అస్సలు ఇష్టం ఉండదని పేర్కొన్నారు. తనకు సవాళ్లు అంటే చాలా ఇష్టమని స్పష్టం చేశారు శ్రేయస్ అయ్యర్.
క్రికెట్ లో విపరీతమైన పోటీ ఉండే ముంబై నుంచి తాను వచ్చానని.. తన మైండ్ సెట్ ఎప్పుడు కూడా గెలవాలని లక్ష్యంపైన ఉంటుందని వ్యాఖ్యానించారు. బీసీసీఐ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని స్పష్టం చేశారు. దీంతో శ్రేయస్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. కాగా టీ20 ప్రపంచ కప్ తీసుకువచ్చిన సూర్యకుమార్ యాదవ్ పై వేటు వేసిన బీసీసీఐ.. ఐపీఎల్ లో అద్భుతంగా రాణించిన శ్రేయస్ ను కెప్టెన్ చేసింది. కెప్టెన్ గా సూర్య కుమార్ యాదవ్ 90% సక్సెస్ అవుతున్నప్పటికీ.. ఆటగాడిగా విఫలమవుతున్నాడు. అందుకే బీసీసీఐ అతనిపై వేటు వేసినట్లు చెబుతున్నారు క్రీడా విశ్లేషకులు.






