'పెద్ది' మూవీకి భారీ క‌లెక్ష‌న్స్‌..రామ్ చ‌ర‌ణ్ అరుదైన రికార్డ్

by velandi.Saikiran |

'పెద్ది' మూవీ రూ.250 కోట్లు దాటినట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

పెద్ది మూవీకి భారీ క‌లెక్ష‌న్స్‌..రామ్ చ‌ర‌ణ్ అరుదైన రికార్డ్
X

దిశ‌, వెబ్ డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కలిసి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చింది. 4 రోజుల కిందట రిలీజ్ అయిన ఈ సినిమా, కలెక్షన్స్ లో దూసుకు వెళ్తోంది. మూడు రోజుల్లో రూ. 236 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా... లేటెస్ట్ అప్డేట్ ప్రకారం రూ.250 కోట్లు కూడా దాటినట్లు ట్రేడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ క్రమంలో రామ్ చరణ్ సరికొత్త రికార్డు సృష్టించినట్లు సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ గా మారింది.

రామ్ చరణ్ సోలోగా చేసిన సినిమాలలో ఫాస్టెస్ట్ రూ. 250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రికార్డు నెలకొల్పిన సినిమా పెద్దినేన‌ని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. నాలుగు రోజుల్లోనే ఈ రికార్డు సాధ్యమైనట్లు చెబుతున్నారు. అయితే వీకెండ్ ముగియడంతో సోమ‌వారం నుంచి కలెక్షన్స్ తగ్గే అవకాశాలు ఉన్నట్లు కూడా సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. కాగా ఈ సినిమాలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ అందాల ఆరబోతపై వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. ఆమె పర్మిషన్ లేకుండానే.. డైరెక్టర్ బుచ్చిబాబు బోల్డ్ సీన్స్ పెట్టాడని ప్రచారం జరుగుతోంది.

Next Story